తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అక్కడి ఫ్యాక్టరీల్లో ఇక మహిళలకూ నైట్‌ షిఫ్ట్‌లు - karnataka news

మహిళలు పరిశ్రమల్లో రాత్రివేళ పనిచేసేందుకు అనుమతిస్తూ కర్ణాటక ప్రభుత్వం నోటిఫికేషన్​ జారీ చేసింది. పరిశ్రమల చట్టం కింద నమోదైన అన్ని పరిశ్రమల్లో ఈ విధానం అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది.

అక్కడి ఫ్యాక్టరీల్లో ఇక మహిళలకూ నైట్‌ షిఫ్ట్‌లు

By

Published : Nov 21, 2019, 5:27 AM IST

సాంకేతిక విజ్ఞానం, విభిన్నమైన పరిశ్రమలు విస్తరిస్తున్న నేపథ్యంలో సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఈ పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా సమానంగా పరుగులు పెడుతున్నారు.

ఈ తరుణంలో ఇప్పటికే ఐటీ రంగంలో మహిళలు రాత్రిపూట షిఫ్టుల్లో పనిచేస్తుండగా.. ఇతర రంగాల్లోనూ వారు రాత్రి వేళల్లో పనిచేసేలా కర్ణాటక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తి రంగంతో పాటు ఇతర పరిశ్రమల్లో కూడా మహిళలు ఇకపై రాత్రిపూట (రాత్రి 7గంటల నుంచి ఉదయం 6గంటల వరకు) పనిచేసేందుకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

పరిశ్రమల చట్టం - 1948 చట్టంలోని సెక్షన్‌ 66(1)(b)సెక్షన్‌ ప్రకారం మహిళలు రాత్రిపూట పనిచేయడం నిషిద్ధం. అయితే, దీన్ని మద్రాస్‌ హైకోర్టు కొట్టివేస్తూ గతంలో ఇచ్చిన తీర్పును కర్ణాటకలోని యడియూరప్ప సర్కార్‌ ఉటంకించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ తాజా నోటిఫికేషన్‌తో ఉత్పత్తి రంగంతో పాటు ఇతర రంగాల్లోనూ మహిళలు రాత్రిపూట పనిచేసే అవకాశం కలగనుంది.

ఇదీ చూడండి: చిట్​ఫండ్​ చట్ట సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details