తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బంగారం' కేసులో ఎన్​ఐఏ దర్యాప్తు ముమ్మరం - kerala gold smuggling swapna suresh

కేరళ బంగారం స్మగ్లింగ్​ కేసుకు సంబంధించి విచారణ ప్రారంభించింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ). ప్రధాన నిందితురాలు స్వప్నా సురేశ్ సహా నలుగురిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసింది. ఈ కేసులో స్వప్నకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయొద్దని కేరళ హైకోర్టుకు నివేదించింది ఎన్​ఐఏ. ఆమెపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొంది.

Woman wanted in gold smuggling case booked under UAPA: NIA to Kerala HC
బంగారం స్మగ్లింగ్​ కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన ఎన్​ఐఏ

By

Published : Jul 10, 2020, 7:19 PM IST

కేరళలో రాజకీయ దుమారం రేపిన 30 కేజీల బంగారం స్మగ్లింగ్​ కుంభకోణం కేసులో ఎఫ్​ఐఆర్​ నమోదు చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ). ప్రధాన నిందితురాలు స్వప్నా సురేశ్​​తో పాటు సరిత్​, సందీప్ నాయర్, ఫజిల్​ ఫరీద్​పై చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం(యూఏపీఏ) కింద అభియోగాలు మోపింది.

రూ.14.8 కోట్లు విలువైన బంగారం స్మగ్లింగ్ కేసును గురువారమే ఎన్​ఐఏకు బదిలీ చేసింది కేంద్ర హోంశాఖ.

బెయిల్​ ఇవ్వొద్దు..

ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కేరళ హైకోర్టును బుధవారం రాత్రి ఆన్​లైన్​ ద్వాారా ఆశ్రయించింది స్వప్న. ఆమెకు బెయిల్​ ఇవ్వొద్దని కోర్టును ఎన్​ఐఏ శుక్రవారం కోరింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం(యూఏపీఏ) కింద కేసు నమోదైనట్లు పేర్కొంది. బంగారం స్మగ్లింగ్​లో ఆమె పాత్ర గురించి తెలియాలంటే విచారించేందుకు రిమాండ్​కు తరలించాల్సిన అవసరముందని న్యాయస్థానానికి వివరించింది.

ఈ కేసుతో స్వప్నకు సంబంధముందని రుజువు చేసేందుకు మరో నిందితుడు సరిత్​, సందీప్​ నాయర్ భార్య వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించారు కేంద్రం తరఫు న్యాయవాది.

వాదనలు విన్న అనంతరం ఈ కేసులో అరెస్టు నుంచి స్వప్నకు మధ్యంతర రక్షణ కల్పించేందుకు నిరాకరించారు న్యాయమూర్తి జస్టిస్​ అశోక్ మేనన్​.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details