తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొడుకు కోసం 6 రాష్ట్రాలు.. 2,700 కి.మీ ప్రయాణించిన తల్లి - మైయోసిటిస్

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్​డౌన్ కొనసాగుతోంది. బయటకి వెళ్లే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో అనారోగ్యానికి గురైన తన కొడుకును చూసేందుకు ఓ అమ్మ తల్లడిల్లిపోయింది. తన కుమారుడిని చూసి తీరాలని సంకల్పించుకుంది. ఆరు రాష్ట్రాల మీదుగా.. 2,700 కి.మీ దూరం ప్రయాణించింది. ఈ జర్నీలో ఆ తల్లి పడిన కష్టం ఎలాంటిది.? చివరికి కొడుకును చేరుకుందా తెలుసుకుందాం.

Woman
కొడుకు కోసం 6 రాష్ట్రాలు.. 2,700 కి.మీ ప్రయాణించిన తల్లి

By

Published : Apr 17, 2020, 6:36 AM IST

సృష్టిలో అమ్మను మించిన దైవం లేదు. అమ్మ ప్రేమలో స్వార్థం ఉండదు. తన బిడ్డకు చిన్న దెబ్బతగిలితే తానే ఎక్కువగా తల్లడిల్లిపోతుంది. దేశవ్యాప్తంగా లాక్​డౌన్ కట్టుదిట్టంగా అమలు జరగుతున్న తరుణంలో.. అనారోగ్యానికి గురైన కొడుకును చూసేందుకు సాహసమే చేసింది కేరళలోని తిరువనంతపురానికి చెందిన ఓ మాతృమూర్తి. ఏకంగా 6 రాష్ట్రాలు దాటి 2,700 కిలో మీటర్లు ప్రయాణించింది.

కేరళలోని తిరువనంతపురానికి చెందిన షీలమ్మ (50) అనే మహిళ కొడుకు బీఎస్​ఎఫ్​ జవాను. రాజస్థాన్​ జోధ్​పుర్​లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అతనికి భార్య, ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. అయితే.. అతడు మైయోసిటిస్​తో బాధపడుతున్నాడు. లాక్​డౌన్​ కొనసాగుతున్న నేపథ్యంలో కొడుకును కలుసుకునే వీలులేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా తన బిడ్డను చూడాలని నిర్ణయించుకుంది. తన అల్లుడు, ఇంకో బంధువుతో కారులో మూడు రోజుల పాటు 6 రాష్ట్రాల మీదుగా 2,700 కిలోమీటర్లు ప్రయాణించి జోధ్​పుర్​కు చేరుకుంది.

" నా కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తనని చూసేందుకు వెళ్లాలని నిశ్చయించుకున్నా. ఇందుకు కొట్టాయం నుంచి జోధ్​పుర్​ ప్రయాణించాం. దేవుని దయవల్ల మేము ఎక్కడా ఎటువంటి సమస్యలు లేకుండా ఇక్కడ వరకు చేరుకున్నాం. మాకు ఎంతో సహకరించిన కేంద్రమంత్రి వి.మురళీధరన్, ముఖ్యమంత్రికి నా ధన్యవాదాలు. "

- షీలమ్మ, తల్లి

అధికారుల సాయంతో..

కొడుకు దగ్గరకు వెళ్లాలనుకున్న షీలమ్మ కేరళ నుంచి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్​ మీదుగా రాజస్థాన్​ చేరుకున్నారు. ఇందుకు వారి కుటుంబం దేశవ్యాప్తంగా ప్రయాణానికి అవసరమైన పాస్​లను పొందారు. అంతేకాకుండా వీహెచ్​పీ సంస్థ ఏర్పాటు చేసిన హిందూ హెల్ప్​లైన్​ వలంటీర్లు ఓ క్యాబ్​ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇద్దరు టాక్సీడైవర్లనూ జోధ్​పుర్​ వరకు పంపించారు. కొట్టాయం జిల్లా కలెక్టర్​ పీకే.సుధీర్​ బాబు ప్రయాణానికి అవసరమైన పాస్​లను అందించారు. షీలమ్మ, అల్లుడు పార్వత్యం, మరో వ్యక్తితో కలిసి ఈనెల 11న బయలుదేరి 14న జోధ్​పుర్​ చేరుకున్నారు.

ఇదీ చదవండి:మాస్కుల వాడకంపై మరింత స్పష్టత ఇచ్చిన కేంద్రం

ABOUT THE AUTHOR

...view details