ఓ మహిళ ఫోన్ మాట్లాడుతూ పొరపాటున బావిలో పడిపోయిన ఘటన కేరళ మలప్పురం జిల్లా తిరూర్‌లో శుక్రవారం రాత్రి జరిగింది. చివరికి ఆ ఫోను సాయంతో స్వల్పగాయాలతో బయటపడింది.
ఎడకులం గ్రామానికి చెందిన 24 ఏళ్ల ఆ అమ్మాయి తిరూర్లోని తన బంధువుల ఇంటికి వచ్చింది. సమీపంలోని ఆలయంలో జరుగుతున్న పండుగ వేడుకలను చూడడానికి వెళ్లింది. అయితే అక్కడ జనం ఎక్కువగా ఉండటం వల్ల ఫోన్ చేయడానికి ఓ నిర్జన ప్రదేశానికి వెళ్లింది. ఫోన్ మాట్లాడుతూ అనుకోకుండా బావిలో పడిపోయింది.