మహారాష్ట్రలో అమానుష ఘటన చోటు చేసుకుంది. సాయం అడిగిన ఓ యువతిని ముగ్గురు వ్యక్తులు రెండు గంటల్లో.. వేరువేరు ప్రదేశాల్లో అత్యాచారం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
అసలెలా జరిగింది..
ఫిబ్రవరి 18న సబర్బన్ ఘాట్కోపర్ రైల్వేస్టేషన్లో తన బంధువులతో కలిసి వెళ్లాల్సిన యువతి.. రైలును సమయానికి అందుకోలేకపోయింది. అనంతరం వేరే రైలులో ముంబ్రా స్టేషన్ చేరుకొని.. ఆ రాత్రికి అక్కడే నిద్రపోయింది.
ఫిబ్రవరి 19 ఉదయాన్నే మరో రైలెక్కి దివా స్టేషన్ చేరుకుంది. అక్కడినుంచి వెళ్లడానికి డబ్బుల్లేక.. తన ముక్కుపుడకను అమ్మిపెట్టమని ఓ యాచకురాలిని అడిగింది. అయితే.. ఆ ప్రయత్నం విఫలం కాగా రింగ్‌ను విక్రయించేందుకు గంటల పాటు ఆపసోపాలు పడిందా యువతి. ఇక ఏం చెయ్యాలో తెలియక అలా స్టేషన్ చేరుకునేందుకు నడవడం ప్రారంభించింది.