తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పశువైద్యురాలి హత్యోదంతంపై  ఆగ్రహ జ్వాల - అత్యాచారంపై దేశరాజధాని దిల్లీ, బంగాల్​లలో నిరసన ప్రదర్శనలు మిన్నంటాయి.

తెలంగాణలో యువ పశువైద్యురాలి హత్యోదంతంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. పలు స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు నిందితులకు ఉరిశిక్ష వేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నాయి. దేశరాజధాని దిల్లీ, బంగాల్​లలో నిరసన ప్రదర్శనలు మిన్నంటాయి. 'వుయ్​ వాంట్​ జస్టిస్​',  'వైద్యురాలి కుటుంబానికి న్యాయం చేయాలి'.. 'దోషులను కఠినంగా శిక్షించాలి' అంటూ నినాదాలు చేశారు.

protests
పశువైద్యురాలి హత్యోదంతంపై  ఆగ్రహ జ్వాల

By

Published : Dec 1, 2019, 5:32 AM IST

Updated : Dec 1, 2019, 9:13 AM IST

పశువైద్యురాలి హత్యోదంతంపై ఆగ్రహ జ్వాల

హైదరాబాద్​కు చెందిన పశు వైద్యురాలిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆపై ఆమెను హత్యచేసిన ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఉదంతంపై శనివారం కోల్​కతా, దిల్లీల్లో నిరసనలు ప్రతిధ్వనించాయి. పలు స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు నిందితులకు ఉరిశిక్ష వేయాలంటూ డిమాండ్​ చేస్తున్నాయి. దిల్లీ పార్లమెంట్‌ స్ట్రీట్‌లో యువత భారీ ఎత్తున ఆందోళన చేపట్టింది. నిందితులను కఠినంగా శిక్షించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కొవ్వొత్తుల ర్యాలీ..

వైద్యురాలిపై జరిగిన దారుణాన్ని ఖండిస్తూ యూత్​ కాంగ్రెస్​ కార్యకర్తలు శనివారం రాత్రి దిల్లీలోని జంతర్​ మంతర్​ వద్ద కొవొత్తులను వెలిగించి, శాంతి ర్యాలీ నిర్వహించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ యూత్​ కాంగ్రెస్​ నేత అమ్రిక్​ రంజన్​ పాండే విమర్శించారు.

బంగాల్ సిలీగుడీలో భాజపా మహిళా మోర్చా సభ్యులు.. కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వాట్సప్​ గ్రూపుల్లోనూ..

వైద్యురాలి హత్యోదంతానికి సంబంధించిన వార్తలు, కథనాలు, ఖండనలతో శనివారం సామాజిక మాధ్యమాలు పోటెత్తాయి. వాట్సప్​ గ్రూపుల్లో వీటిపై చర్చలు సాగాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో తీవ్రతరం...

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఉదంతంపై తీవ్ర స్థాయిలో ఆందోళనలు రేకెత్తుతున్నాయి. షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకొని పలు ప్రజాసంఘాలు నిరసన తెలిపాయి. జాతీయ మహిళా కమిషన్‌.. బాధితురాలి కుటుంబ సభ్యుల్ని శనివారం పరామర్శించింది. ఈ ఘటనలో నిందితులకు 14 రోజుల రిమాండ్​ విధించింది. వీరిని చర్లపల్లి జైలుకు తరలించారు.

ఇదీ చూడండి : యువ వైద్యురాలి హత్యపై దిల్లీలోనూ ఆందోళనలు

Last Updated : Dec 1, 2019, 9:13 AM IST

ABOUT THE AUTHOR

...view details