ప్లాస్టిక్.. దశాబ్దాలుగా మానవ జీవితంలో భాగమై, రాబోయే కాలంలో మనిషి మనుగడనే ప్రశ్నార్థకంలో పడేసిన భూతం. భూమిపై జనజీవనానికి హానికరంగా అవతరించిన ప్లాస్టిక్‌ను తరిమికొట్టేందుకు ప్రపంచ దేశాలు నడుం బిగించాయి. మోదీ ప్రభుత్వం ప్లాస్టిక్ రహిత నవ భారతావనిని నిర్మించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ బాటలోనే నడుస్తున్న ఒడిశాకు చెందిన 69 ఏళ్ల వృద్ధురాలు.. ప్లాస్టిక్ వ్యర్థాల పునర్వినియోగానికి జీవం పోస్తున్నారు. వ్యర్థాలతో సుందరమైన గృహాలంకరణ వస్తువులకు రూపకల్పన చేస్తూ.. కుటుంబసభ్యులు, స్నేహితుల మన్ననలు పొందుతున్నారు.
ఇదీ చూడండి: పెళ్లి పీటలపైనే భర్తకు బడితపూజ చేసిన భార్య
భువనేశ్వర్‌కు చెందిన సాయిబాలాదాస్.. 1990లోనే ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఇందుకు ఆమె భర్త లక్ష్మీ నారాయణ దాస్ కూడా సాయమందించారు. 'ప్లాస్టిక్‌ను వదిలేయడం కంటే పునర్వినియోగం మేలు' అనే నినాదంతో ముందుకెళ్తూ.. దేశ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు దాస్ దంపతులు.