కర్ణాటక మైసూర్లో పిల్లలను చంపి ఆపై తానూ ఆత్మహత్య చేసుకుంది ఓ కర్కశ తల్లి. చరవాణిని భర్త తీసుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ముజమిల్, సుఫియా భార్యాభర్తలు. వీరిద్దరికి మునేజా(3), ఇనయా(1) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ముజమిల్ మైసూర్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. చాలా రోజులుగా సుఫియా చరవాణి వాడకానికి బానిసైంది. అయితే ఈ విషయంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. తాజాగా ఆమె ఫోన్‌ను భర్త బలవంతంగా తీసుకొని ఉద్యోగానికి వెళ్లగా.. మనస్తాపానికి గురైన సుఫియా తన ఇద్దరు పిల్లలను హత్యచేసింది. అనంతరం ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ప్రాణాలు విడిచింది.