శవాన్ని ఇంట్లో ఉంచుకుని నాలుగు రోజుల పాటు సావాసం చేసింది ఓ మహిళ. ఈ ఘటన తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో జరిగింది.
ఏం జరిగింది?
చెంగల్పట్టు జిల్లా పెరియాపుదుర్కు చెందిన దామోదరన్.. జ్యోతిష్కుడుగా పని చేస్తూ పొట్ట నింపుకునేవాడు. ఆరేళ్ల క్రితమే అతడి భార్య మృతి చెందింది. అప్పటినుంచి తన సహాయకురాలైన రాజేశ్వరి అనే మహిళతో అతడు సహజీవనం చేస్తున్నాడు. నాలుగురోజులుగా తమ ఇంటి చుట్టు పక్కన ఉన్న పిల్లలను పిలిచి తమ కోసం ఆహారాన్ని కొనుక్కురావాల్సిందిగా రాజేశ్వరి అడుగుతూ ఉంది. దామోదరన్ గురించి చుట్టుపక్కల ఇళ్ల వారు అడిగితే..'ఆసుపత్రికి వెళ్లాడు, పట్టణానికి వెళ్లాడు' అని పొంతన లేని సమాధానం చెబుతూ ఉండేది.