తెలంగాణ

telangana

ETV Bharat / bharat

19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం - రాజస్థాన్​లో అత్యాచారం

రాజస్థాన్​లో మరో దారుణం జరిగింది. ఓ మహిళపై వారం రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారు. ఘటనను ఫోన్​లో చిత్రీకరించి ఎవరికైనా చెబితే సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరించారు.

Woman gangraped in Rajasthan's Churu
19 ఏళ్ల యువతిపై 9 మంది సామూహిక అత్యాచారం

By

Published : Oct 6, 2020, 8:59 AM IST

దేశంలో అత్యాచార ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఉత్తర్​ప్రదేశ్​లో హాథ్రస్​ ఘటన మరువకముందే రాజస్థాన్​లో మరో దారుణం జరిగింది. ఓ 19 ఏళ్ల యువతిపై కొంతమంది సామూహిక అత్యాచారం చేశారు.

ఇదీ జరిగింది...

చురూ జిల్లాలో సెప్టెంబర్ 24న ఎస్ఎస్​సీ పరీక్షకు దరఖాస్తు చేసేందుకు విక్రమ్​ అనే తెలిసిన వ్యక్తితో బయటకు వెళ్లింది ఓ యువతి. సాయం చేసే నెపంతో ఆమెను కారులో ఎక్కించుకున్నాడు విక్రమ్. అప్పటికే కారులో మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. మాయమాటలు చెప్పి యువతిని ఓ హోటల్​కు తీసుకువెళ్లి మత్తుమందు కలిపిన పానీయం తాగించి సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణాన్ని చరవాణిలో చిత్రీకరించారా రాక్షసులు. ఎవరికీ ఈ విషయాన్ని చెప్పకూడదని బెదిరించారు.

అనంతరం బాధితురాలుపోలీసులకు ఫిర్యాదు చేసింది. ముకేశ్ గుర్జార్ అనే వ్యక్తి తనను వారం రోజులుగా జైపుర్​ హోటల్​లో అత్యాచారం చేసినట్లు పేర్కొంది. ఘటనపై మొత్తం 9 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ABOUT THE AUTHOR

...view details