తెలంగాణ

telangana

ETV Bharat / bharat

20 ఏళ్ల తర్వాత భార్యాభర్తలను కలిపిన 'కరోనా' - migrant worker news

కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్​తో యావత్​ భారతావని ఇంటికే పరిమితమైంది. వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కూలీలు స్వస్థలాలకు చేరేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. బంగాల్​కు చెందిన ఓ మహిళకు మాత్రం లాక్​డౌన్​ మంచే చేసింది. ఇంటి నుంచి వెళ్లిపోయిన భర్తను 20 ఏళ్ల తర్వాత కలిసేలా చేసింది.

corona
20 ఏళ్ల తర్వాత భార్యభర్తలను కలిపిన 'కరోనా'

By

Published : May 29, 2020, 12:12 PM IST

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షల మందికి తీరని నష్టాన్ని చేకూర్చితే.. బంగాల్​కు చెందిన ఓ మహిళకు మాత్రం మేలు చేసింది. ఇంటి నుంచి వెళ్లిపోయిన తన భర్తను 20 ఏళ్ల తర్వాత కలిపింది. భర్త తిరిగి వచ్చిన తరుణంలో ఆమె సంతోషానికి అవధులు లేవు.

ఇదీ జరిగింది..

పశ్చిమ బంగ అసన్సోల్​ జిల్లా బర్న్​పుర్​ గ్రామానికి చెందిన సురేశ్​ ప్రసాద్​ అనే వ్యక్తి 20 ఏళ్ల క్రితం భార్యపై కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దిల్లీకి చేరుకుని.. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించాడు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభించటం వల్ల దిల్లీ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించటం ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రసాద్​ దిల్లీ నివాసి కాదని తేలింది. వలస కూలీలను స్వరాష్ట్రాలకు తరలించే క్రమంలో ప్రసాద్​ను అసన్సోల్​కు పంపారు అధికారులు. 20 ఏళ్ల తర్వాత భర్త తిరిగి రావటం వల్ల అతని భార్య ఊర్మిళ ప్రసాద్​ సంతోషం వ్యక్తం చేసింది.

14 రోజుల క్వారంటైన్​లో భాగంగా ప్రసాద్​ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరానికి తరలించారు అధికారులు​.

ABOUT THE AUTHOR

...view details