సింహాల గుంపు చుట్టుముట్టి అంబులెన్స్‌ను కదలకుండా చేయటం వల్ల ఓ మహిళ అంబులెన్స్‌లోనే ప్రసవించాల్సి వచ్చింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
ఏమైందంటే..
సింహాల గుంపు చుట్టుముట్టి అంబులెన్స్‌ను కదలకుండా చేయటం వల్ల ఓ మహిళ అంబులెన్స్‌లోనే ప్రసవించాల్సి వచ్చింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
ఏమైందంటే..
ప్రసవ వేదనతో ఉన్న ఓ మహిళను ఆస్పత్రికి చేర్చేందుకు ఆమె ఇంటికి అంబులెన్స్ వచ్చింది. వారు మార్గమధ్యంలో ఉండగానే నాలుగు సింహాలు రోడ్డుపై కనిపించాయి. ఇక చేసేదేంలేక అంబులెన్స్‌ను కాస్త దూరంలో ఆపి వేచిచూడటం మొదలుపెట్టారు. ఇంతలో నొప్పులు తీవ్రం కావటంతో అత్యవసర వైద్య సిబ్బంది సహకారంతో ఆ మహిళ అంబులెన్స్‌లోనే ప్రసవించింది. ఆ సింహాలు 20 నిముషాలకు పైగా అదే ప్రాంతంలో తచ్చాడాయని వారు తెలిపారు.
చివరకు సింహాలు మరలిపోయిన అనంతరం వారు ఉన్న అంబులెన్స్ ఆస్పత్రికి చేరుకుంది. తల్లీ బిడ్డలకు అవసరమైన వైద్య సేవలు అందించామని... వారిద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్య సిబ్బంది తెలిపారు.
ఇదీ చదవండి:చూడ'చెక్కిన' తాజ్‌మహల్.. చూపులకే సవాల్