తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా రోగిపై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారం - rape attempt on corona patient in pathanamthitta

కేరళలో కొవిడ్ బాధితురాలిని లైంగికంగా వేధించాడు ఓ అంబులెన్స్ డ్రైవర్. కరోనా సోకుతుందని తెలిసినా.. యువతిని శారీరకంగా హింసించాడు ఆ మృగాడు.

covid-19 patient was allegedly rapaed by an ambulance driver
కరోనా రోగిపై అంబులెన్స్ డ్రైవర్ పాడు కన్ను!

By

Published : Sep 6, 2020, 2:12 PM IST

కేరళలో కరోనా సోకిన ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అంబులెన్స్ డ్రైవర్. పతనంతిట్ట, అరన్ములలోని కొవిడ్ కేర్ సెంటర్ నుంచి చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలిస్తుండగా 19 ఏళ్ల బాధితురాలిపై ఘాతుకానికి పాల్పడ్డాడు.

అంబులెన్స్ డ్రైవర్

బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు.. కయంకులం గ్రామానికి చెందిన డ్రైవర్ నౌఫల్(29)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 108 అంబులెన్స్ సేవల నుంచి నౌఫల్​ను తొలగించారు. దారుణ శారీరక వేధింపులకు గురైన యువతి ప్రస్తుతం అడూర్​లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

"ఆసుపత్రి నిర్వహకుల సమాచారం మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. త్వరలో యువతి నుంచి వివరాలు సేకరిస్తాం. ప్రస్తుతం బాధితురాలు జరిగినది వివరించే పరిస్థితిలో లేదు."

-పోలీస్ అధికారి

ఇదీ చదవండి:"నా సొరకాయలు పోయాయి సార్..!"

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details