దిల్లీ శాసనసభకు నేడు పోలింగ్ జరుగనున్న వేళ తుపాకి కాల్పుల ఘటన దిల్లీలో కలకలం సృష్టించింది. రోహిణి మెట్రో స్టేషన్ వద్ద ఓ మహిళా ఎస్ఐపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పత్పర్గంజ్ ఇండస్ట్రీయల్ ఏరియా పోలిస్స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న ప్రీతీ అహ్లావత్ ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఘటన జరిగిందని సమాచారం. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించామని, త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు.
వ్యక్తిగత కారణాల వల్లే మహిళా ఎస్ఐపై కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 2018లో దిల్లీ పోలీస్ విభాగంలో విధుల్లో చేరారు అహ్లావత్.