బిహార్లోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సజీవ దహనానికి గురైన ఓ మహిళ మరణ వార్తను ఎన్నికల ప్రయోజనం కోసం ప్రభుత్వం దాచిపెట్టిందని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో మంచిపాలన అందిస్తారా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఈ మేరకు ఓ కథనాన్ని జత చేశారు.
" ఎవరు ఈ అమానవీయ ఘటనకు పాల్పడ్డారు. ఎన్నికల్లో లాభం కోసం ఎవరు తప్పులను కప్పిపెట్టారు. ఇలాంటి చర్యలతో మంచిపాలనకు పునాది వేస్తారా?"