కేరళలో బంగారం స్మగ్లింగ్ కేసులు అధికమయ్యాయి. ఈ రోజు విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తోన్న ఓ మహిళను కన్నూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు కస్టమ్స్ అధికారులు. ఆమె నుంచి రూ. 47.63 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కన్నూరు జిల్లాలోని చొక్లీకి చెందిన ఓ మహిళ... గో ఎయిర్ విమానంలో దుబాయ్ నుంచి కన్నూరుకు చేరుకుంది. ఆమెపై అనుమానం వచ్చి, అధికారులు తనిఖీ చేయగా... లోదుస్తుల్లో మిశ్రమ రూపంలో 1170 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు. దానిని స్వాధీనం చేసుకొని, వేరు చేయగా 949 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఉన్నట్లు తేలిందని చెప్పారు.