కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి మనం మాటిమాటికీ చేతులు కడుక్కుంటున్నాం. మరి మనిషి మొత్తంగా ఒకేసారి శుభ్రపడాలంటే?.. ఇలాంటి ఓ పరికరానికి (ఎన్‌క్లోజర్) తాజాగా డీఆర్‌డీఓ రూపకల్పన చేసింది. మహారాష్ట్రలోని అహమ్మద్‌నగర్ ల్యాబొరేటరీలో దీన్ని రూపొందించారు. ఒకసారి ఒక వ్యక్తి ఇందులోకి వెళ్లి నిలబడితే విద్యుత్ ఆధారంగా నడిచే పంపు 25 సెకన్లపాటు ఇన్‌ఫెక్షన్లను నిర్మూలించే హైపోసోడియం క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తుంది. తర్వాత దానంతట అదే ఆగిపోతుంది.
25 సెకన్లలో శరీరంపై ఉన్న క్రిములన్నీ కడిగేస్తుంది! - కరోనా కేసులు
కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి రోజూ శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటాం. మరి మొత్తం శరీరాన్నే కడుక్కోవాలంటే దారేమైనా ఉందా?.. అవును ఇటీవల మహారాష్ట్రలోని ఓ ల్యాబొరేటరీలో సరికొత్త పరికరాన్ని రూపొందించారు. ఇందులో నిలబడితే చాలు మీ శరీరంపై ఉన్న క్రిములన్నింటినీ కేవలం 25 సెకన్లలో కడిగేస్తుంది.
వాటిని తప్పనిసరిగా మూసుకోవాలి...
700 లీటర్ల సామర్థ్యంతో ఉండే ట్యాంకును ఒకసారి నింపితే 650 మందిని శుభ్రం చేస్తుంది. లోపల జరుగుతున్న ప్రక్రియ బయటకు కనిపించేలా ఎన్‌క్లోజర్‌కు ఇరువైపులా అద్దాలు ఏర్పాటు చేశారు. దూరంగా ఏర్పాటుచేసిన కేబిన్ ద్వారా ఓ ఆపరేటర్ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తారు. ఇందులోకి వెళ్లే వ్యక్తులు తప్పనిసరిగా ఓ జాగ్రత్త తీసుకోవాలి. పిచికారీ సమయంలో కళ్లు, చెవులను పూర్తిగా మూసుకొని ఉండాలి. ఉత్తరప్రదేశ్‌లోని డీహెచ్ లిమిటెడ్ అనే సంస్థతో కలిసి డీఆర్‌డీఓ దీన్ని 4 రోజుల్లో తయారు చేసింది. ఆసుపత్రులు, మాల్స్, కార్యాలయాలు, ఇతర వ్యవస్థల్లోకి వెళ్లి వచ్చేవారిని శుభ్రం చేయడానికి ఇది దోహదపడుతుందని డీఆర్‌డీఓ తెలిపింది.