తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుడ్​ న్యూస్​: తగ్గుతున్న యాక్టివ్​ కేసులు

భారత్​లో యాక్టివ్​ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం మొత్తం కేసుల్లో మూడో వంతు(3.31లక్షలు) మాత్రమే యాక్టివ్​ కేసులు ఉన్నాయని పేర్కొంది. రికవరీ రేటు 63.25శాతానికి చేరిందని తెలిపింది.

With steady decline, active COVID-19 cases now constitute a third of total tally: Health Ministry
గుడ్​ న్యూస్​: దేశంలో తగ్గుతున్న యాక్టివ్​ కేసులు

By

Published : Jul 16, 2020, 6:49 PM IST

దేశంలో 3,31,146 కరోనా యక్టివ్​ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇది దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో(9.68లక్షలు) మూడో వంతు అని పేర్కొంది. కేసుల తగ్గుదలకు తీసుకున్న చర్యలే ఇందుకు కారణమని స్పష్టం చేసింది.

జూన్​ మధ్య వారానికి రికవరీ రేటు 50శాతానికి చేరిందని.. అప్పటి నుంచి యాక్టివ్​ కేసులు క్రమక్రమంగా తగ్గుతూ వచ్చాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

"మొత్తం కరోనా కేసుల్లో ఇప్పటివరకు 63.25శాతం మంది కోలుకున్నారు. అదే విధంగా.. యాక్టివ్​ కేసులు కూడా తగ్గాయి. జూన్​ మధ్య వారానికి 45శాతం ఉన్న యాక్టివ్​ కేసులు.. ఇప్పుడు 34.18శాతానికి చేరాయి."

--- కేంద్ర ఆరోగ్య శాఖ.

అయితే మొత్తం యాక్టివ్​ కేసుల్లో 84.62శాతం కేసులు 10రాష్ట్రాల్లోనే ఉన్నాయని తెలిపింది ఆరోగ్యశాఖ. ఇందులో 48.15శాతం మహారాష్ట్ర, తమిళనాడుకు చెందినవి అని పేర్కొంది.

ఇదీ చూడండి:-కరోనా నుంచి దేవుడే కాపాడాలి: ఆరోగ్య మంత్రి

గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 32,695కేసులు నమోదయ్యాయి. అయితే గడిచిన 24గంటల్లో 20,783మంది వైరస్​ను జయించారు. ఇప్పటివరకు ఇదే అత్యధికం. దీంతో మొత్తం రికవరీ అయిన బాధితుల సంఖ్య 6,12,814కు చేరింది.

ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టడం, నియంత్రణ చర్యలు, సమయానికి కాంటాక్ట్​ ట్రేసింగ్​ చేయడం, పరీక్షలు ఎక్కువగా జరపడం, సమయానికి చికిత్స అందించడం, మోస్తరు-తీవ్రమైన కేసుల విషయంలో సమర్థమైన క్లినికల్​ నిర్వహణతో యాక్టివ్​ కేసులను తగ్గించినట్టు పేర్కొంది కేంద్ర ఆరోగ్యశాఖ.

ఇవీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details