తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'శ్రీలంకకూ చైనా భయం- దిల్లీ వైఖరే కీలకం' - former foreign secretary saran

రాజపక్స సోదరులు మళ్లీ శ్రీలంక పీఠాన్ని అధిరోహించిన నేపథ్యంలో భారత్, శ్రీలంక మధ్య గత సంబంధాలు భవిష్యత్తుపై ప్రభావం చూపకుండా జాగ్రత్తపడాలని మాజీ విదేశాంగ కార్యదర్శి శ్యామ్ సరన్ సూచించారు. ఆసియాలో చైనా ఆధిపత్యం పెరుగుతున్న విషయం నిజమని అన్నారు. ఈ తరుణంలో భారత్​కు అతిపెద్ద సవాలు చైనానే అని అభిప్రాయపడ్డారు. ఈటీవీ భారత్​తో ముఖాముఖిలో శ్యామ్ సరన్​ పలు విషయాలను పంచుకున్నారు.

with-rajapaksas-back-at-helm-past-must-not-shadow-india-lanka-ties-says-shyam-saran
'శ్రీలంకకూ చైనా భయం- దిల్లీ వైఖరే కీలకం'

By

Published : Nov 27, 2019, 5:40 PM IST

మాజీ విదేశాంగ కార్యదర్శి శ్యాం సరన్​తో ముఖాముఖి

ప్రశ్న: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా గొటబాయ రాజపక్స, ప్రధానిగా మహీంద రాజపక్స ఎన్నికయ్యారు. ఈ పరిస్థితుల్లో చైనా ఆధిపత్యం గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. ఇప్పుడు దిల్లీ ముందున్న కర్తవ్యమేంటీ?

జవాబు:గతాన్ని మన మెడకు చుట్టుకొని ఉండకూడదు. ఇది దౌత్య సంబంధాలలో ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం. రాజపక్స రాకతో శ్రీలంక-భారత్​ మధ్య కొన్ని విషయాల్లో ఆందోళన నెలకొంది. కానీ ఇరుదేశాల మధ్య సంబంధాలను కొనసాగించడానికి చాలా అవకాశాలు ఉన్నాయన్న విషయం గుర్తుంచుకోవాలి.
ఇరుదేశాల మధ్య బలమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. కొన్నేళ్లుగా దక్షిణ భారతదేశానికి, శ్రీలంకకు మధ్య ఉన్న సంబంధాలతో రెండు దేశాలు లాభపడ్డాయి.

రాజపక్స సోదరులు ఆచరణాత్మక నాయకులు అయితే వారు కూడా ప్రస్తుత పరిస్థితులపై గతం తాలూకు ప్రభావం పడకుండా భారత్-శ్రీలంక సంబంధాలను ముందుకు తీసుకువెళ్తారు. ఇరుదేశాల సంబంధాల ద్వారా ఏర్పడే ఉన్నత ప్రయోజనాలను తప్పకుండా గ్రహిస్తారు.

చైనా విషయానికి వస్తే... ఆ దేశం నుంచి వస్తున్న పెట్టుబడులు తమ ఆర్థిక వ్యవస్థకు ముప్పు కలిగించి భవిష్యత్తులో పూర్తిగా చైనాపై ఆధారపడేలా చేస్తుందన్న భయాలు శ్రీలంకకూ ఉన్నాయి. అందువల్ల ఏకకాలంలో భారత్​, చైనాతో సమతుల్యమైన సంబంధాలను నెరపడం శ్రీలంకకు చాలా ముఖ్యం.

ప్రశ్న: శ్రీలంకలో జరుగుతున్న విషయాలను భారత్​ కేవలం చూస్తూ ఉండటం సాధ్యమేనా? ఎందుకంటే గతంలో భారత్​ ప్రభావంతో ఆ దేశ మాజీ అధ్యక్షుడు సిరిసేన, మాజీ ప్రధాని విక్రమసింఘేల మధ్య అధికారం కోసం ఎన్నో కలహాలు ఏర్పడ్డాయి.

జవాబు: ఇరుగుపొరుగు దేశాల రాజకీయాలలో పూర్తిగా జోక్యం చేసుకోవడం భావ్యం కాదు. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు తప్పకపోవచ్చు. నాయకులను దేశానికి మిత్రులు, లేదా శత్రువులుగా నిర్ణయించడం ద్వారా ఎలాంటి ఫలప్రదమైన ప్రయోజనాలు చేకూరవు. ఇరుదేశాలకు ఉమ్మడిగా ప్రయోజనం కలిగించే వాటిపై శ్రద్ధ కనబర్చడం ద్వారానే సానుకూల ఫలితాలు వస్తాయి.

ప్రశ్న: మాజీ జాతీయ భద్రతా సలహాదారు, మాజీ విదేశాంగ కార్యదర్శి ఎస్​.ఎస్​.మీనన్​ కొలొంబో రేవును ఉదహరిస్తూ... చైనా చేపట్టిన బెల్డ్, రోడ్​ ఇనీషియేటివ్(బీఆర్​ఐ)ను భారత్​ వ్యతిరేకించకూడదని స్పష్టంగా చెప్పారు. దీనిపై ఏమంటారు?

జవాబు: వేదిక ఎవరు నిర్మిస్తున్నారన్నది ముఖ్యం కాదు. వేదిక ఒకరు నిర్మించినప్పటికీ వాటిని పూర్తిగా ఉపయోగించుకునే హక్కు ఒక్కరికే పరిమితం కాదు. అలాంటి వేదికలను మన ప్రయోజనాలకోసం ఉపయోగించుకుంటే తప్పు లేదు.

శ్రీలంక రేవులోనూ రెండు నూతన టెర్మినల్స్ చైనానే నిర్మించింది. అవి ప్రస్తుతం అంతర్జాతీయ వాణిజ్యానికి ఉపయోగపడుతున్నాయి. చైనా నిర్మించిందన్న కారణంతో వాటితో మనం ఏం చేయలేమని అనుకోకూడదు.

ప్రశ్న: పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో చైనా చేపడుతున్న సీపెక్​(చైనా పాక్​ ఎకనామిక్​ కారిడార్​) కేంద్రీకృతంగానే బెల్ట్ రోడ్ ఇనీషియేటివ్​ను భారత్ వ్యతిరేకిస్తోందా?

జవాబు: ఇది భవిష్యత్తులో ఏర్పడే రకరకాల సంబంధాలను బేరీజు వేసుకొని తీసుకునే జాగ్రత్తలు. మీరు ఏఐఐబీ(ఆసియా ఇన్​ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్), బ్రిక్స్ డెవలప్​మెంట్ బ్యాంకును తీసుకోండి. రెండు ప్రాజెక్టులలో చైనా ఆధిపత్యం ఉన్నప్పటికీ భారత్​ చాలా క్రియాశీలంగా వ్యవహరిస్తోంది. ఏఐఐబీలో భారత్​ రెండో అతిపెద్ద వాటాదారుగా ఉంది. రెండు సంస్థల రూపకల్పనలలో భారత్ చాలా ముఖ్య పాత్ర పోషించింది. కానీ బీఆర్ఐ కి ఉన్న తేడా ఏంటి? ఇది బహుపాక్షిక ప్రాజెక్టు కాదు. ఇది పూర్తిగా రూపొందించింది చైనానే. పూర్తిగా అపారదర్శకంగా ఉంది కాబట్టి ప్రాజెక్టు నిర్మాణాత్మక విషయాలపై స్పష్టత లేదు. ఉదాహరణకు చైనా, భారత్​లు కలిసి మరో దేశంలో ఏదైనా ప్రాజెక్టు చేపడితే మూడు దేశాలకు ప్రయోజనం చేకూరితే సమస్య ఉండదు.

ఆర్​సెప్​ నుంచి భారత్​ వైదొలగడంపై నిరాశ వ్యక్తం చేశారు శ్యామ్ సరన్. ఆర్​సెప్​ నుంచి దూరం జరగడం వల్ల భవిష్యత్తులో అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ (ఎఫ్​టీఏ) కుదుర్చుకోవడం మరింత కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details