కరోనా భయంతో సాయమందించే వారే కరవై.. అయినవారికి సరైన అంతిమయాత్ర కూడా చేయలేని దుస్థితిలో ఉన్నారు కొంతమంది. ఇటీవల కర్ణాటకలో ఓ వృద్ధుడు మరణించగా.. కొవిడ్ వల్లే మృతిచెందాడని అనుమానించి ఏ ఒక్కరూ సాయం చేయడానికి రాలేదు. ఇక చేసేదేమీ లేక వర్షంలో సైకిల్‌పైనే మృతదేహాన్ని తరలించారు బాధిత కుటుంబ సభ్యులు.
ఇదీ జరిగింది..
బెళగావిలోని కిట్టూర్లో ఓ 70 ఏళ్ల వ్యక్తి అనారోగ్యం బారినపడ్డాడు. కుటుంబ సభ్యులు సమీపంలోని ఓ వైద్యుడికి చూపించగా.. కొవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి, ఆస్పత్రిలో చేర్పించమని సూచించారు. ఇంతలోనే అతడు మరణించాడు. ఎడతెరపిలేని వర్షాల కారణంగా మృతదేహానికి అంత్యక్రియలు చేపట్టడం ఆ కుటుంబానికి కష్టమైంది. అంబులెన్స్ సాయం కోసం అత్యవసర నంబర్‌కు డయల్ చేయగా ఎలాంటి స్పందనా లేదు. కరోనా భయంతో స్థానికులెవరూ ముందుకురాలేదు. ఇక చేసేదేమీలేక సైకిల్‌పైనే మృతదేహాన్ని స్మశానవాటికకు తరలించారు.