తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో 77లక్షలు దాటిన కరోనా కేసులు - Coronavirus death toll in India

భారత్​లో కొత్తగా 55,838 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 77 లక్షల 7 వేలకు చేరువైంది. మరో 702మంది కొవిడ్​తో చనిపోయారు.

With 55,838 new #COVID19 infections, India's total cases surge to 77,06,946
దేశంలో 77 లక్షలు దాటిన కరోనా కేసులు

By

Published : Oct 22, 2020, 9:52 AM IST

Updated : Oct 22, 2020, 11:20 AM IST

దేశంలో కరోనా కేసుల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. కొత్తగా 55,838 కేసులు బయటపడ్డాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 77 లక్షల 6వేల 946కు చేరింది. మరో 702 మంది మహమ్మారికి బలయ్యారు.

మొత్తం కేసులు: 77,06,946

మొత్తం మరణాలు: 1,16,616

కోలుకున్నవారు:68,74,518

దేశంలో రికవరీల సంఖ్య గణనీయంగా పెరిగింది. తాజాగా 79,415 మంది మహమ్మారిని జయించగా.. మొత్తం రికవరీల సంఖ్య 68,74,518 చేరింది. ఫలితంగా రికవరీ రేటు 89.20శాతానికి పెరిగంది. మరణాల రేటు 1.51 శాతానికి తగ్గింది.

ఒక్కరోజులో 14,69,984 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. దీంతో కొవిడ్ నిర్ధరణ పరీక్షల సంఖ్య 9 కోట్ల 86 లక్షల 70 వేలు దాటింది.

ఇదీ చూడండి:'సీబీఐ'కి అనుమతి ఉపసంహరించిన ఠాక్రే సర్కార్​

Last Updated : Oct 22, 2020, 11:20 AM IST

ABOUT THE AUTHOR

...view details