తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో 81 లక్షలు దాటిన కరోనా కేసులు - భారత్​లో పెరుగుతున్న కేసులు

భారత్​లో కరోనా కేసులు 81 లక్షల మార్కును అధిగమించాయి. ఒక్కరోజే 48 వేల కేసులు.. 551 మరణాలు నమోదయ్యాయి. క్రియాశీల కేసుల సంఖ్య 6 లక్షల దిగువనే ఉంది.

INDIA CASES
భారత్​లో కరోనా కేసులు

By

Published : Oct 31, 2020, 9:38 AM IST

Updated : Oct 31, 2020, 10:26 AM IST

భారత్​లో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కొత్తగా 48 వేల 268 మందికి వైరస్​ సోకింది. మరో 551 మంది ప్రాణాలు కోల్పోయారు.

మొత్తం కేసులు 81 లక్షల మార్కును దాటాయి. క్రియాశీల కేసులు 6 లక్షల దిగువనే ఉన్నాయి.

దేశంలో కేసుల వివరాలు

దేశంలో కొవిడ్​ బాధితులు వేగంగా కోలుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా రికవరీ రేటు 91.34 శాతానికి చేరినట్లు స్పష్టం చేసింది. మరణాల రేటు 1.49 శాతానికి పడిపోయింది.

ఏ రాష్ట్రాల్లో కేసులు ఎలా

రోజూ 10 లక్షలకుపైగా టెస్టులు..

శుక్రవారం రోజు 10 లక్షల 67 వేల 976 కరోనా నిర్ధరణ పరీక్షలను నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ పేర్కొంది. మొత్తం టెస్టుల సంఖ్య 10 కోట్ల 87 లక్షల 96 వేలను అధిగమించింది.

Last Updated : Oct 31, 2020, 10:26 AM IST

ABOUT THE AUTHOR

...view details