తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో మరో 43,893 కేసులు, 508 మరణాలు

దేశంలో తాజాగా 43 వేలకుపైగా కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 508మంది మరణించారు. దీంతో కేసుల సంఖ్య 80 లక్షలకు చేరగా.. మృతుల సంఖ్య 1.20లక్షలు దాటింది.

COVID-19 infections
భారత్​లో కరోనా కేసులు

By

Published : Oct 28, 2020, 10:18 AM IST

దేశంలో కరోనా కేసులు మంగళవారం భారీగా తగ్గగా.. బుధవారం మళ్లీ పెరిగాయి. కొత్తగా 43,893 కేసులు నమోదయ్యాయి. మరో 508 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 80 లక్షలకు చేరువయ్యాయి.

అయితే ఒక్కరోజే 58,439మంది కోలుకోవడం వల్ల మొత్తం రికవరీల సంఖ్య 72,59,509కి చేరింది. క్రియాశీల కేసులు 6,10,803లకు పడిపోయాయి. భారత్​లో రికవరీ రేటు 90 శాతం దాటినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇదీ చూడండి: 'వ్యాక్సిన్ సరఫరాకు వనరుల సమస్య లేదు'

ABOUT THE AUTHOR

...view details