దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్కరోజు 36 వేల 469 మందికి వైరస్ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 79 లక్షల 50 వేలకు చేరువైంది. మరో 488 మంది మరణించారు.
గత 3 నెలల వ్యవధిలో ఇవే తక్కువ కేసులు అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 90.62 శాతానికి చేరింది. మరణాల రేటు 1.50 శాతానికి పడిపోయింది.