తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా' విధ్వంసం- ఒక్కరోజులో 3 వేలమందికి వైరస్ - కరోనా తాజా వార్తా

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య 2.76 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 8వేలకు చేరువైంది.. కరోనాకు కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో కేసుల సంఖ్య 94వేలు దాటింది. తమిళనాడులో 36 వేలు, గుజరాత్​లో 21 వేల కేసులు నమోదయ్యాయి.

With 17 fatalities, COVID-19 death toll climbs to 432 in Bengal; 343 fresh cases
మహారాష్ట్రలో ఇవాళ 3 వేల కేసులు నమోదు

By

Published : Jun 10, 2020, 11:11 PM IST

Updated : Jun 10, 2020, 11:25 PM IST

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కొవిడ్​ బాధితుల సంఖ్య 2,76,583కు చేరింది. 7,745 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా 1,33,632 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

మహారాష్ట్రలో 3,254 కేసులు

మహారాష్ట్రలో కరోనా వైరస్​ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. బుధవారం మరో 3,254 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 94,041కి చేరింది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 149 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 3,488కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 44,517 మంది కోలుకున్నారు.

తమిళనాడులో 326 మంది మృతి..

తమిళనాడులోనూ కరోనా కేసుల ఉద్ధృతి ఎక్కువగా ఉంది. ఒక్కరోజులో 1,927 మందికి వైరస్ పాజిటివ్​గా తేలింది. 19 మంది మృతి చెందారు. వరుసగా 11 రోజుల నుంచి వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 36,841కి ఎగబాకింది. వీరిలో 17,179 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. మరో 19,333 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 326కు చేరింది.

గుజరాత్​లో 510 కేసులు..

గుజరాత్​లోనూ వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 510 మందికి కరోనా సోకింది. 34 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 21,554, మృతుల సంఖ్య 1347కు చేరినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14,743 మంది ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.

బంగాల్​లో 343 కేసులు

బంగాల్​లో బుధవారం మరో 343 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 9,328కి చేరింది. వీరిలో 5,117 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 432 మంది మృతి చెందారు.

కర్ణాటకలో 71 మంది మృతి..

కర్ణాటకలో కొత్తగా 120 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ వ్యాధి సోకిన వారిలో ఐదుగురు మరణించగా మృతుల సంఖ్య 71కి చేరింది. మొత్తం కేసుల సంఖ్య 6,041కి ఎగబాకింది.

ఇద్దరు జవాన్లకు కరోనా

సెంట్రల్​ రిజర్వ్​ పోలీస్​ ఫోర్స్​ (సీఆర్​పీఎఫ్​) 90వ బెటాలియన్​లోని ఓ జవానుకు సన్నిహితంగా ఉన్న 28 మందికి కరోనా సోకినట్లు తేలింది. వీరంతా దక్షిణ కశ్మీర్​లో విధులు నిర్వహిస్తున్నారు. బాధితులను నిర్బంధ కేంద్రానికి తరలించారు. ఇండో టిబెటెన్​ బోర్డర్​ పోలీసులో బుధవారం ఒకరికి కరోనా సోకింది. ఫలితంగా మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 22కు చేరింది. ఇప్పటి వరకు 194 మందికి వైరస్​ నయమైంది.

  • హరియాణాలో బుధవారం 370 మందికి వైరస్ సోకింది. మరో ఏడుగురు మృతి చెందారు. దీంతో మొత్తం బాధితులు సంఖ్య 6 వేలకు చేరువైంది.
  • ఉత్తరాఖండ్​లో 23 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా.. కేసుల సంఖ్య 1,560కి ఎగబాకింది. 808 మంది డిశ్చార్జి అయ్యారు. 15 మంది మృతి చెందారు.
  • కేరళలో బుధవారం 65 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,238 కరోనా యాక్టివ్​ కేసులు ఉండగా, 905 మంది రికవరీ అయ్యారు.
  • గోవాలో మొత్తం కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య 387కు చేరింది. ఇందులో 248 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. ఇందులో 108 మంది ఇతర ప్రాంతాల నుంచి గోవా వచ్చిన వారు ఉన్నారు.
  • హిమాచల్​ ప్రదేశ్​లో మొత్తం బాధితుల సంఖ్య 450కి చేరింది. ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందారు.
  • జమ్ముకశ్మీర్​లో తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం 4,507 మందికి వైరస్​ సోకినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంలో 2,785 మంది చికిత్స పొందుతుండగా, 1,671 మంది కోలుకున్నారు. 51 మంది మృత్యువాతపడ్డారు.
Last Updated : Jun 10, 2020, 11:25 PM IST

ABOUT THE AUTHOR

...view details