తెలంగాణ

telangana

ETV Bharat / bharat

450 పడకల కరోనా ఆసుపత్రిగా విప్రో కార్యాలయం!

మహారాష్ట్ర ప్రభుత్వం కరోనాపై చేస్తున్న పోరులో తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చించి ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో. హింజెవాడీ ప్రాంతంలో విప్రోకు చెందిన ఓ కార్యాలయాన్ని 450 పడకల ఆసుపత్రిగా మార్చనున్నట్లు అధికారులు ప్రకటించారు.

Wipro to repurpose Pune IT facility to 450-bed COVID-19 hospital
450 పడకల కరోనా ఆసుపత్రిగా విప్రో కార్యాలయం!

By

Published : May 6, 2020, 6:18 AM IST

దేశంలో కరోనా కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో రోజురోజుకూ వందల కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాపై ఉద్ధవ్ ఠాక్రే సర్కార్​ చేస్తున్న పోరులో సాయం చేసేందుకు ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో ముందుకు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. పుణేలో ఓ విప్రో కార్యాలయాన్ని 450 పడకల ఆసుపత్రిగా మార్చుతున్నట్లు తెలిపారు.

" హింజెవాడీ ప్రాంతంలో విప్రోకు చెందిన ఓ కార్యలయాన్ని కరోనా ఆసుపత్రిగా మార్చుతుంది. ప్రస్తుత ఐటీ కార్యాలయాన్ని ఆసుపత్రిగా మార్చి ప్రభుత్వానికి అందజేసేందుకు మరో నాలుగు వారాలు పడుతుంది.​ మే 30 నాటికి ఈ పని పూర్తవుతుంది. ఏడాది తర్వాత ఈ ఆసుపత్రి తిరిగి ఐటీ కార్యాలయంగా మారుతుంది."

- అధికారిక ప్రకటన.

కరోనా బాధితులకు చికిత్స అందించే డాక్టర్లు, వైద్య సిబ్బంది ఈ ఆసుపత్రిలోనే ఉండేందుకు 24 గదులు కూడా ఉంటాయి. అలాగే హాస్పిటల్​లో మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు, ఇతర సదుపాయాలతో పాటు సిబ్బందిని కూడా విప్రోనే ఏర్పాటు చేస్తుంది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్పందన..

తమ కార్యాలయాన్ని కరోనా ఆసుపత్రిగా మార్చాలన్న విప్రో నిర్ణయాన్ని స్వాగతించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే. మానవతా దృక్పథంతో విప్రో చేసిన ఈ సాయం వల్ల రాష్ట్రంలో వైద్య మౌలిక సదుపాయాలు మరింత మెరుగవుతాయని ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details