తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కశ్మీర్​ అభివృద్ధికి అన్ని వర్గాలతో కలిసి పనిచేస్తున్నాం' - JKAP

కశ్మీర్​ను అభివృద్ధి చేసేందుకు అన్ని వర్గాల వారితో కలిసి పనిచేస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ఈ మేరకు జేకేఏపీ అధినేత బుఖారీతో భేటీ అయిన మోదీ.. కశ్మీర్​ అభివృద్ధికి యువత ఉత్ప్రేరక ఏజెంట్లుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Will work with all to ensure early restoration of statehood to JK
కశ్మీర్​ అభివృద్ధికోసం అన్ని వర్గాలతో కలిసి పనిచేస్తున్నాం

By

Published : Mar 15, 2020, 5:37 AM IST

కశ్మీర్​ని అభివృద్ధి చేసేందుకు తాము అన్ని వర్గాల వారితో కలిసి పని చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడిన 'జమ్ము కశ్మీర్​ అప్నీ పార్టీ(జేకైఏపీ)' అధినేత అల్తాఫ్​ బుఖారీతో మోదీ చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా అల్తాఫ్​ నివాసంలో సమావేశమైన ప్రధాని.. జన సంఖ్య, సరిహద్దులకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావించారని అధికారిక వర్గాలు తెలిపాయి. కశ్మీర్​ పురోగతి అంశంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్ర భూభాగాన్ని మార్చే విషయంలో ప్రతినిధి బృందంతో కలిసి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు మోదీ. అంతేకాకుడా.. కేంద్రపాలిత ప్రాంతాభివృద్ధికి సంబంధించిన పాలనా ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

యువత ఉత్ప్రేరక ఏజెంట్లుగా..

రాజకీయ సమైక్యత ద్వారా వేగవంతంగా ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయొచ్చని మోదీ పేర్కొన్నారు. కశ్మీర్​ అభివృద్ధికి యువకులు ఉత్ప్రేరక ఏజెంట్లుగా పనిచేయాలని కోరారు. అందులో భాగంగా.. యువతకు కల్పించే ఉపాధి అవకాశాల ప్రాముఖ్యత గురించి పేర్కొన్నారు.

కశ్మీర్​ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందన్న మోదీ... మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని సూచించారు. తద్వారా నూతన పెట్టుబడి అవకాశాలను సృష్టించుకోవచ్చన్నారు. కశ్మీర్​లో ఆర్థిక వృద్ధితో పాటు.. పర్యటక రంగంగా కూడా అభివృద్ధి చేయడానికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.

జేకేఏపీ ఆవిర్భావం

కశ్మీర్​ మాజీ ఆర్థిక మంత్రి బుఖారీ ఆధ్వర్యంలో.. 30 మంది పార్టీ నాయకులతో ఈ నెల 8న జేకేఏపీ పార్టీ ఆవిర్భవించింది. నేషనల్​ కాన్ఫరెన్స్​ నేత ఫరూక్​ అబ్దుల్లా విడుదలను జేకేఎన్​పీ స్వాగతించింది.

ఇదీ చదవండి:కరోనాను ఎదుర్కోవాలంటే.. ఆ 30రోజులే కీలకం.?

ABOUT THE AUTHOR

...view details