న్యాయ ప్రక్రియను నిరోధిస్తే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ పర్యటించేందుకు సిద్ధమని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో అత్యాచార బాధితులను పరామర్శించేందుకు రాహుల్ ఎందుకు వెళ్లడం లేదని భాజపా నేతలు చేసిన విమర్శలకు ఈ మేరకు స్పందించారు. రెండు రాష్ట్రాల్లో జరిగిన అత్యాచార ఘటనల్లో తమ ప్రభుత్వాలు న్యాయాన్ని అడ్డుకోలేదని అన్నారు.
"ఉత్తర్ప్రదేశ్లా కాకుండా పంజాబ్, రాజస్థాన్ ప్రభుత్వాలు బాధితులు అత్యాచారానికి గురైన విషయాన్ని ఖండించలేదు. బాధిత కుటుంబాన్ని బెదిరించడం, న్యాయ ప్రక్రియను అడ్డుకోవడం వంటివి చేయలేదు. ఒకవేళ అలా చేస్తే.. నేను అక్కడికి వెళ్లి న్యాయం కోసం పోరాడతాను."