ప్రభుత్వం కేటాయించిన దిల్లీలోని నివాస గృహాన్ని ఆగస్టు 1వ తేదీలోపు ఖాళీ చేయనున్నట్లు వెల్లడించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ప్రభుత్వం జారీ చేసిన నోటీసులను అనుసరించే నెల రోజుల్లోపు ఖాళీ చేస్తామని స్పష్టం చేశారు.
నివాస సదుపాయాన్ని పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వచ్చిన మీడియా నివేదికలను తోసిపుచ్చారు ప్రియాంక.
అవి తప్పుడు వార్తలు. ప్రభుత్వానికి నేను అలాంటి అభ్యర్థనలు చేయలేదు. జులై 1న అందిన నోటీసుల ప్రకారం.. ఆగస్టు 1లోపు లోధిలోని 35వ నంబరు ప్రభుత్వ నివాస గృహాన్ని ఖాళీ చేస్తాను.