తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కర్తార్​పుర్​ సమస్యలను పరిష్కరించుకుంటాం'

కర్తార్​పుర్​ నడవాపై భారత్​-పాక్​ మధ్య తలెత్తిన భేదాభిప్రాయాలను పరిష్కరించుకుంటామని తెలిపింది విదేశాంగ మంత్రిత్వ శాఖ. జులై 14న జరగనున్న సమావేశంలో ఆ దిశగా కృషి చేస్తామని పేర్కొన్నారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్​ కుమార్.

'కర్తార్​పుర్​ సమస్యలను త్వరలోనే పరిష్కరించుకుంటాం'

By

Published : Jul 5, 2019, 7:24 AM IST

Updated : Jul 5, 2019, 8:19 AM IST

కర్తార్​పుర్​ సమస్యలను పరిష్కరించుకుంటాం

కర్తార్​పుర్​ నడవా నిర్మాణంపై పాకిస్థాన్​తో​ తలెత్తిన విభేదాలను జులై 14న జరగబోయే సమావేశంలో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రవీశ్​ కుమార్​ తెలిపారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లు చెప్పారు.

నడవా సాకారమైతే ఇరుదేశాల సిక్కు భక్తులు తమ పవిత్ర క్షేత్రాల్ని ఎలాంటి వీసా లేకుండానే దర్శించుకోగలుగుతారు.

జులై 14న రెండోసారి..

కర్తార్​పుర్​ నడవా నిర్మాణంపై పాకిస్థాన్​తో భారత భూభాగంలోని అటారీ-వాఘా సరిహద్దులో మార్చి 14న మొదటి సమావేశం జరిగింది. జులై 14న పాకిస్థాన్ భూభాగం వాఘా సరిహద్దులో ఇరు దేశాల ప్రతినిధులు సమావేశమవుతారు.

జులై 11 నుంచి 14 మధ్య మరోసారి చర్చలు జరపాలని పాక్​ను భారత్​ కోరింది. 14వ తేదీన చర్చించేందుకు అంగీకరించింది దాయాది దేశం. కర్తార్​పుర్​ ప్రాజెక్టుకై పాక్​ నియమించిన కమిటీలో ఖలిస్థానీ వేర్పాటువాదికి చోటు కల్పించాలని భారత్ సూచించింది.

సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​ లేఖ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఆ సందర్భంలో కర్తార్​పుర్​ నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఇమ్రాన్​కు సూచించారు మోదీ.

ఇదీ చూడండి: పద్దు-19: కోట్లాది ప్రజల ఆకాంక్షల నడుమ నేడే బడ్జెట్​

Last Updated : Jul 5, 2019, 8:19 AM IST

ABOUT THE AUTHOR

...view details