కేంద్ర ప్రభుత్వంపై ఇటీవల విమర్శల ట్వీట్ల వర్షం కురిపిస్తున్న రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఫిబ్రవరి-జులై వరకు కరోనా కాలంలో కేంద్రం సాధించిన విజయాలంటూ తాజాగా చేసిన ట్వీట్‌కు అదే తీరులో జవాబిచ్చారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్. ఆయా నెలల్లో రాహుల్ సాధించిన విజయాలంటూ పలు విషయాలతో చురకలంటించారు.
"రాహుల్ గాంధీ ప్రతిరోజు ట్వీట్ చేస్తున్నారు. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ట్వీట్లకే పరిమితమైందని అనుకుంటున్నా. కాంగ్రెస్ పని చేయట్లేదని అనేందుకు ఒకదాని తర్వాత ఒక రాష్ట్రం సాక్ష్యంగా నిలుస్తోంది. తిరస్కరణకు గురైన పార్టీ కేంద్రంపై అన్ని విధాల దాడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. కానీ వారు అందులో విజయం సాధించరు."