తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చోక్సీ కోసం ఎయిర్​ అంబులెన్స్​ ఏర్పాటు చేస్తాం' - Punjab National Bank scam

పంజాబ్​ నేషనల్​ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు మెహుల్​ చోక్సీని భారత్​కు రప్పించేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది. ఆయన కోసం వైద్య నిపుణుల బృందంతో ప్రత్యేక ఎయిర్​ అంబులెన్స్​ను ఏర్పాటు చేస్తామని బాంబే హైకోర్టు తెలిపింది.

'చోక్సీ కోసం ఎయిర్​ అంబులెన్స్​ ఏర్పాటు చేస్తాం'

By

Published : Jun 23, 2019, 5:36 AM IST

పీఎన్​బీ కుంభకోణం కేసులో కీలక నిందితుడు మెహుల్‌ చోక్సీని ఆంటీగ్వా నుంచి భారత్‌కు రప్పించేందుకు వైద్యనిపుణుల బృందంతో ప్రత్యేక ఎయిర్‌ అంబులెన్స్‌ను ఏర్పాటు చేస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది.

విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్న చోక్సీ అనారోగ్య కారణాలతో భారత్‌కు రాలేనని ముఖం చాటేశారు. తాను ఆశ్రయం పొందుతున్న ఆంటిగ్వాలోనే విచారణ ఎదుర్కుంటానని పేర్కొంటూ బాంబే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసిన ఈడీ.. చోక్సీ కోర్టుని తప్పుదోవ పట్టిస్తూ దర్యాప్తు ప్రక్రియను ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. భారత్‌కు చోక్సీ రాలేకపోవడానికి అనారోగ్యమే కారణమైతే.. అతడిని ఆంటిగ్వా నుంచి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఎయిర్‌ అంబులెన్స్‌ ఏర్పాటు చేస్తామని తెలిపింది. అంతేకాకుండా భారత్ వచ్చాక అవసరమైన చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కౌంటర్ అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:'ఇరాన్​ గగనతలం మీదుగా ప్రయాణం వద్దు'

ABOUT THE AUTHOR

...view details