తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వారి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నా: మోదీ - PM MODI FETIVAL WISHES

కరోనా విజృంభణ నడుమ నేడు దేశవ్యాప్తంగా ప్రజలు వివిధ పండుగలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కరోనాపై పోరులో తమ వంతు కృషి చేస్తున్న వారి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నట్టు ట్వీట్​ చేశారు.

Will pray for health, safety of those engaged in combating coronavirus: PM Modi
వారి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నా: మోదీ

By

Published : Mar 25, 2020, 10:08 AM IST

దేశంలో వివిధ రాష్ట్రాలకు నూతన ఏడాది శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కరోనాపై యుద్ధంలో తమ వంతు కృషి చేస్తున్న వారందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్​ చేశారు.

ఉగాది, గుడిపడవ, నవ్​రేహ్​ తదితర పండుగల నేపథ్యంలో ఆయా భాషల్లో పండుగ శుభాకాంక్షలను ప్రధాని ట్వీట్​ చేశారు.

వారి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నా: మోదీ
వారి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నా: మోదీ

"దేశవ్యాప్తంగా నూతన ఏడాదితో పాటు వివిధ పండుగలను మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మీరు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. డాక్టర్లు, నర్సులు, పోలీసులు,వైద్య, మీడియా సిబ్బంది ఆరోగ్యం, భద్రత, విజయం కోసం నేను దుర్గా మాతను ప్రార్థిస్తున్నా."

--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

'అందరి జీవితాల్లో కొత్త వెలుగులు..'

ఉగాది పండుగ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దేశవాసులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ.. అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

దేశ ప్రజలందరికీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రకృతి కొత్త రెక్కలు తొడిగి మళ్లీ తన పరిమళాలు వెదజల్లే వసంత రుతువు ఆగమనాన్ని సూచించే ఉగాది పండగ.. అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. సంప్రదాయ నూతన సంవత్సరం.. ప్రజల్లో కొత్త విశ్వాసాన్ని నింపి.. భారతదేశం, ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాన్ని సూచించే దిశగా ముందుకు నడిపిస్తుందని ఆకాంక్షిస్తున్నా. కరోనాను తరిమేసేందుకు ప్రభుత్వాలు, వైద్యులు చేస్తున్న ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతును అందజేద్దాం. మనం చేసే ఈ ప్రయత్నంతో కరోనాపై విజయం సాధిస్తామని నేను విశ్వసిస్తున్నాను. ప్రపంచమంతా కరోనా మహమ్మారి బారిన పడి విలవిల్లాడుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు, వైద్య నిపుణులు చేస్తున్న సూచనలు, జాగ్రత్తలను నూటికి నూరుశాతం పాటిద్దాం."

-- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి.

ABOUT THE AUTHOR

...view details