ద్రావిడ పితామహుడు, సంఘ సంస్కర్త పెరియార్ చేపట్టిన ర్యాలీపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని సూపర్‌స్టార్ రజినీకాంత్ స్పష్టం చేశారు. జనవరి 14వ తేదీన తుగ్లక్ పత్రిక వార్షికోత్సవంలో పాల్గొన్న రజినీ.. 1971లో పెరియార్ నిర్వహించిన ర్యాలీలో సీతారాముల విగ్రహాలను అభ్యంతరకరంగా ఊరేగించారని ఆరోపించారు. తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ లేదా విచారం వ్యక్తం చేసే ప్రసక్తే లేదని రజినీకాంత్ వెల్లడించారు.
క్షమాపణలు చెప్పటం కుదరదు: రజినీకాంత్ - సూపర్‌స్టార్ రజినీకాంత్
పెరియార్ చేపట్టిన ర్యాలీపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు సూపర్‌స్టార్ రజినీకాంత్. పెరియార్ ర్యాలీలో తాను విన్నది, పత్రికల్లో వచ్చిన దాని గురించే మాట్లాడానని.. క్షమాపణలు చెప్పటం కుదరదని వెల్లడించారు.

క్షమాపణలు చెప్పటం కుదరదు: రజినీకాంత్
సీతారామ విగ్రహాలను అభ్యంతరకంగా ఊరేగించారన్న వార్తలున్న పేపర్ కటింగ్‌లను రజినీ చూపించారు. పెరియార్ ర్యాలీలో జరిగిన దానిపై.. తాను విన్నది, పత్రికల్లో వచ్చిందే చెప్పానని ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పనని రజనీ స్పష్టం చేశారు. మరోవైపు పెరియార్ ర్యాలీపై రజినీ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని ద్రవిడర్ కళగమ్ నేతలు ఆందోళనకు దిగగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: 'ఆపరేషన్ కశ్మీర్'లో కేంద్రం తదుపరి వ్యూహం ఏంటి?
Last Updated : Feb 17, 2020, 9:03 PM IST