తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు ప్రధానితో శరద్​పవార్​ భేటీ... కారణం ఇదే! - మహారాష్ట్ర న్యూస్

రాజకీయ సంక్షోభం నెలకొన్న మహారాష్ట్రలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోదీతో నేడు సమావేశం కానున్నారు. రైతుల సమస్యలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాజ్యసభ​లో ఎన్​సీపీపై ప్రధాని ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

నేడు ప్రధానితో శరద్​పవార్​ భేటీ... వారి కోసమేనా!

By

Published : Nov 20, 2019, 10:00 AM IST

Updated : Nov 20, 2019, 12:02 PM IST

నేడు ప్రధానితో శరద్​పవార్​ భేటీ... కారణం ఇదే!

మహారాష్ట్రాలో రాజకీయ సంక్షోభం నెలకొన్న వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌ నేడు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంటు భవన్‌లో మోదీని పవార్ కలవనున్నారు.

రైతులకోసమేనా!

మహారాష్ట్రలో రైతు సమస్యలపై ప్రధానితో శదర్​ పవార్​ చర్చిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కారణంగా రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో మోదీ, పవార్‌ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. సోమవారం రాజ్యసభలో ప్రధాని మోదీ ఎన్​సీపీపై ప్రశంసల జల్లు కురిపించిన వేళ తాజా సమావేశంపై పలురకాల ఊహాగానాలు రేకెత్తుతున్నాయి. మరోవైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కసరత్తుపై కాంగ్రెస్‌ నేతలతో పవార్‌ ఇవాళ చర్చలు జరపాల్సి ఉంది.

5-6 రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటు​

ప్రధానితో శరద్​ పవార్​ భేటీ పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ప్రధానిని ఎవరైన కలవచ్చని వ్యాఖ్యానించారు. అయిదారు రోజుల్లో మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు ప్రక్రియ పూర్తవుతుందని రౌత్ స్పష్టం చేశారు. రేపు మధ్యాహ్నంలోపు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో స్పష్టత వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

'ప్రధానమంత్రి మొత్తం దేశానికే ప్రధాని. పార్లమెంట్​ లోపలైనా, బయటైనా ప్రధానిని కలుసుకోవచ్చు. మహారాష్ట్రలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శరద్​ పవార్​కు మహారాష్ట్ర రైతాంగం పరిస్థితి బాగా తెలుసు. శరద్​ పవార్, ఉద్ధవ్ ఠాక్రే ఇద్దరు ఎల్లప్పుడు రైతుల గురించే ఆలోచిస్తారు. రాష్ట్రంలో పరిస్థితి గురించి ప్రధానికి వివరించమని శరద్​ పవార్​కు మేము కూడా చెప్పాం. రైతులకోసం పార్టీలకతీతంగా మహారాష్ట్ర ఎంపీలందరం ప్రధానిని కలుస్తాం. రైతులకు కేంద్రం అవసరమైన సహాయం చేయాలని కోరతాం. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గత 10-15 రోజులుగా ఉన్న అడ్డంకులన్నీ ఇప్పుడు తొలగిపోయాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మీకు ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ప్రభుత్వ ఏర్పాటు కోసం 5-6 రోజుల్లో ప్రక్రియ పూర్తి అవుతుంది. డిసెంబర్​లోపు రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం.'-సంజయ్ రౌత్, శివసేన ఎంపీ

Last Updated : Nov 20, 2019, 12:02 PM IST

ABOUT THE AUTHOR

...view details