అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన సందర్భంగా భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఓ హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే భారత్‌తో అతిపెద్ద వాణిజ్య ఒప్పందాన్ని భవిష్యత్‌కోసం వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. తాజాగా మరోమారు ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై పెదవి విరిచారు ట్రంప్. లాస్ వేగాస్లోని ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన.. భారత్‌తో బ్రహ్మాండమైన ఒప్పందం కుదిరే అవకాశముందన్నారు.
అయితే.. అమెరికాకు లాభం కలగకుంటే.. ఒప్పందం మరింత ఆలస్యం అవుతుందేమోనని హెచ్చరించారు.
" వాణిజ్య ఒప్పందం మరింత ఆలస్యం అవుతుందేమో. ఎన్నికల తర్వాత ఇది కుదురే అవకాశమూ ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. మా ప్రథమ ప్రాధాన్యత అమెరికా అయినందున.. ఒప్పందాలు నిజంగా మంచివి అయితేనే.. వాటిని కార్యరూపం దాలుస్తాం. ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా.. అమెరికానే నాకు ముఖ్యం."