తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎంపీ, రాజస్థాన్​లోనూ త్వరలో 'ఆపరేషన్​ కమల్​'! - kailash

కర్ణాటకలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆ పార్టీ సీనియర్​ నేత కైలాశ్ విజయ్​వర్గీయ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో మధ్యప్రదేశ్​, రాజస్థాన్​లో కొత్త 'మిషన్​' ప్రారంభం అవుతుందంటూ భవిష్యత్ వ్యూహాలపై సంకేతాలిచ్చారు.

ఎంపీ, రాజస్థాన్​లోనూ త్వరలో 'ఆపరేషన్​ కమల్​'!

By

Published : Jul 28, 2019, 8:19 PM IST

ఎంపీ, రాజస్థాన్​లోనూ త్వరలో 'ఆపరేషన్​ కమల్​'!

మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్​ సర్కారుకు కర్ణాటక తరహా ముప్పు పొంచి ఉందన్న ఊహాగానాల మధ్య... భాజపా ప్రధాన కార్యదర్శి కైలాశ్​ విజయ్​వర్గీయ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మధ్యప్రదేశ్​, రాజస్థాన్​లోనూ భాజపా సరికొత్త ఆపరేషన్​ చేపడుతుందని జైపుర్​లో చెప్పారు.

"కర్ణాటకలో మంత్రిమండలి పని పూర్తి కానివ్వండి. తర్వాత కొత్త మిషన్​ ప్రారంభం అవుతుంది. కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని పడగొట్టడం మా కోరిక కాదు. కాంగ్రెస్​ విధానాల్లో ఆ రకమైన అనిశ్చితి ఉంది. వారి నాయకత్వంపై సభ్యులకు విశ్వాసం లేదు. వారు చేసిన తప్పులకు వారే బాధ పడుతున్నారు. అందుకే మోదీ ఉండడమే మంచిదని వారికి అనిపిస్తోంది. కాంగ్రెస్​ చేసుకున్న కర్మల కారణంగానే ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. క్రికెట్​ క్రీడలో బౌలర్​ బౌలింగ్​ చేస్తాడు, బ్యాట్స్​మ్యాన్​ బ్యాటింగ్​ చేస్తాడు. ఒక్కోసారి హిట్​ వికెట్​ అయిపోతాడు. అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్​ వికెట్​ పడిపోతోంది."

-కైలాస్​ విజయ్​వర్గీయ, భాజపా ప్రధాన కార్యదర్శి

ABOUT THE AUTHOR

...view details