తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'హరియాణాలోనూ జాతీయ పౌర జాబితా చేపడతాం' - హరియాణ

అసోంలో మాదిరి హరియాణాలోనూ జాతీయ పౌర జాబితా (ఎన్​ఆర్​సీ) చేపడతామని ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్​లాల్​ ఖట్టర్​. ఇందుకోసం అసోం ఎన్​ఆర్​సీలో పాలుపంచుకున్న విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్​ హెచ్​ఎస్​ భల్లా మద్దతు కోరినట్లు తెలిపారు.

'హరియాణాలో జాతీయ పౌర జాబితా చేపడతాం'

By

Published : Sep 15, 2019, 11:03 PM IST

Updated : Sep 30, 2019, 6:33 PM IST

అక్రమ వలదారులను ఏరివేసేందుకు ఇటీవల అసోంలో చేప్టటిన జాతీయ పౌర జాబితా (ఎన్​ఆర్​సీ)పై పలు విమర్శలు తలెత్తిన వేళ.. హరియాణాలోనూ ఎన్​ఆర్​సీ చేపడతామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్​ తెలిపారు.

అక్టోబర్​లో హరియాణా శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలువురు ప్రముఖుల మద్దతు పొందేందుకు 'మహా సంపర్క్​ అభియాన్​' కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఆదివారం నౌకాదళ మాజీ ప్రధానాధికారి సునీల్​ లాంబా, మాజీ న్యాయమూర్తి జస్టిస్​ హెచ్​ఎస్​ భల్లాతో ఖట్టర్​ భేటీ అయ్యారు.

'హరియాణాలోనూ జాతీయ పౌర జాబితా చేపడతాం'

" ఈరోజు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్​ హెచ్​ఎస్​ భల్లా, నౌకాదళ మాజీ ప్రధానాధికారి​ సునీల్ లాంబాను కలిశాను. ఈ భేటీలో దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఇతర సమస్యలపై చర్చించటం జరిగింది. హరియాణాలో జాతీయ పౌర జాబితాను అమలు చేయబోతున్నాం. అందుకోసం సలహాలు, మద్దతు ఇవ్వాలని భల్లాజీని కోరాను."

- మనోహర్​ లాల్​ ఖట్టర్​, హరియాణా ముఖ్యమంత్రి.

అసోంలో నిర్వహించిన ఎన్​ఆర్​సీ తుది జాబితాను గత ఆగస్టు 31న ప్రకటించారు. ఇందులో 19 లక్షల మంది పౌరులకు చోటు దక్కలేదు. ఈ ప్రక్రియపై భాజపా సహా పలు పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.

ఇదీ చూడండి: 60 వసంతాలు పూర్తి చేసుకున్న 'దూరదర్శన్​'

Last Updated : Sep 30, 2019, 6:33 PM IST

ABOUT THE AUTHOR

...view details