తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అసెంబ్లీ సమావేశాల వరకు  ఆ ఎమ్మెల్యేలు హోటల్​లోనే ' - రాజస్థాన్​ రాజకీయం

రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభం నెలకొన్న తరుణంలో పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసి ఉండాలన్నారు ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేవరకూ హోటల్​లోనే ఉండాలని తన మద్దతుదారులను కోరారు.

Will have to stay at Hotel until assembly session concludes: CM Gehlot to MLAs
అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకూ హోటల్​లోనే ఉండాలి

By

Published : Jul 30, 2020, 10:39 PM IST

రాజస్థాన్​లో ఆగస్టు 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. పార్టీ ఎమ్మెల్యేలనుద్దేశించి ప్రసంగించారు సీఎం అశోక్ గహ్లోత్​. జైపూర్​లోని ఫెయిర్​మౌంట్​ హోటల్​లోని కాంగ్రెస్​ శాసనసభ పార్టీ(సీఎల్​పీ) సమావేశం నిర్వహించిన ఆయన.. ఐక్యంగా కలిసి పోరాడుదామని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. పరిస్థితులు చక్కబడేవరకూ ఎన్ని రోజులైనా సరే ఎమ్మెల్యేలు హోటల్​లోనే ఉండాలన్నారు గహ్లోత్​.

తమ కార్యకలాపాలను కూడా హోటల్ నుంచే నిర్వహించాలని పార్టీ సభ్యులను కోరారు సీఎం​. రాష్ట్రంలో రాజకీయ గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఈద్​, రక్షాబంధన్​, శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను కూడా అక్కడే చేసుకోవాలన్నారు. ఇందుకోసం తమ కుటుంబ సభ్యులనూ అక్కడికే పిలిపించుకోవాలని చెప్పారు.

అయితే ఇప్పటివరకు సుమారు 70 మంది ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు, బంధువులు, పిల్లలు ఆ హోటల్​ను సందర్శించారు. మరో 24 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం అక్కడే ఉన్నారు.

ఇదీ చదవండి:ఆగస్టు 14 నుంచి రాజస్థాన్​ అసెంబ్లీ సమావేశాలు

ABOUT THE AUTHOR

...view details