కేంద్రంలో, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న భాజపా ప్రభుత్వాలను ఎవరైనా తప్పుబడితే ఊరుకోమని హెచ్చరించారు కేంద్ర మాజీ సహాయ మంత్రి రామ్‌శంకర్ కఠేరియా.
భాజపా వైపు వేలెత్తితే విరిచేస్తాం: మాజీ మంత్రి - మానవ వనరుల శాఖ మాజీ సహాయ మంత్రి
కేంద్ర మానవ వనరుల శాఖ మాజీ సహాయ మంత్రి రామ్‌శంకర్ కఠేరియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భాజపా వైపు ఎవరైనా వేలెత్తి చూపితే ఆ వేలు విరిచేస్తామని హెచ్చరించారు.

మాట్లాడుతున్న కేంద్ర మానవ వనరుల శాఖ మాజీ సహాయ మంత్రి రామ్‌శంకర్ కఠేరియా
ఉత్తర్‌ప్రదేశ్ ఎటావా లోక్‌సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారాయన. బీఎస్పీ అధినేత్రి మాయావతి ముఖ్యమంత్రిగా ఉండగా తనపై పెట్టిన కేసులను ప్రస్తావిస్తూ ఓ ప్రచార సభలో ఈ వ్యాఖ్యలు చేశారు రామ్‌శంకర్.
మాట్లాడుతున్న కేంద్ర మానవ వనరుల శాఖ మాజీ సహాయ మంత్రి రామ్‌శంకర్ కఠేరియా
మాయవతి నాపై చాలా కేసులు పెట్టారు. నేను పోరాడుతూ ఉన్నాను. నన్ను ఎప్పుడూ జైలుకు పంపలేకపోయారు. ప్రస్తుతం రాష్ట్రంతో పాటు కేంద్రంలోనూ మా ప్రభుత్వం ఉంది. మావైపు ఎవరైనా వేలెత్తి చూపించినట్లయితే ఆ వేళ్లను విరిచేస్తాం.
- రామ్ శంకర్ కఠేరియా, కేంద్ర మాజీ సహాయ మంత్రి