తెలంగాణ

telangana

ETV Bharat / bharat

200 రాకపోతే తప్పుకుంటారా?: ప్రశాంత్​ సవాల్

భాజపా నాయకులకు మరో సవాల్ విసిరారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్​. బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లు రాకపోతే ఆ పార్టీ నేతలు పదవుల నుంచి తప్పుకుంటారా? అని ఛాలెంజ్​ చేశారు.

Will BJP leaders quit if party fails to get 200 seats in Bengal, asks Prashant Kishor
'200 సీట్లు రాకపోతే భాజపా నాయకులు తప్పుకుంటారా?'

By

Published : Dec 22, 2020, 3:20 PM IST

వచ్చే ఏడాది జరిగే బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా రెండు అంకెల సీట్లు కూడా దాటదని జోస్యం చెప్పిన మరునాడే.. ఆ పార్టీ నేతలకు మరో సవాల్ విసిరారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్​. ఎన్నికల్లో 200 సీట్లు గెలుస్తామని చెబుతున్న కాషాయ దళ నాయకులు.. అలా జరగకపోతే పదవుల నుంచి తప్పుకుంటారా? అని ఛాలెంజ్​ చేశారు.

బంగాల్​లో ఈసారి 200 సీట్లకుపై స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి వస్తామని అమిత్​ షా సహా భాజపా నాయకులు చెబుతున్నారు. ఆ పార్టీ రెండంకెలు దాటి 100 సీట్లు గెలిస్తే ట్విట్టర్​ నుంచి తప్పుకుంటానని సోమవారమే ప్రకటించారు ప్రశాంత్ కిశోర్​. ప్రస్తుతం ఆయన మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి రావడానికి ఆయనే కీలక సూత్రధారి.

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం దేశం ఓ ఎన్నికల వ్యూహకర్తను కోల్పోతుందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ​వర్గీయ అన్నారు. ప్రశాంత్​ వ్యాఖ్యలకు స్పందనగా ఈ ట్వీట్ చేశారు.

ఇదీ చూడండి: '200 స్థానాలు గెలుస్తాం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం'

ABOUT THE AUTHOR

...view details