తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అడవి పందుల కోసం పెడితే ఏనుగు చనిపోయిందట!

కేరళలో గర్భంతో ఉన్న ఏనుగుని చంపిన నిందితుడు... పోలీసుల దర్యాప్తులో పలు విషయాలు వెల్లడించాడు. తాను అడవి పందుల కోసం కొబ్బరికాయల్లో పేలుడు పదార్థాలు పెడితే... అనుకోకుండా ఏనుగు వాటిని తినడానికి ప్రయత్నించి మరణించిందని చెప్పుకొచ్చాడు. అయితే నిందితుడు విల్సన్ అటవీ జంతువులను వేటాడి, వాటి మాంసాన్ని విక్రయిస్తుంటాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

Wild elephant death: The snare was a cracker-stuffed coconut confesses culprit
ఏనుగు మృతి కేసులో ఓ నిందితుడు విల్సన్ అరెస్టు

By

Published : Jun 6, 2020, 11:34 AM IST

కేరళలో గర్భంతో ఉన్న ఏనుగుని పేలుడు పదార్థాలు పెట్టి దారుణంగా చంపేసిన నిందితుడు విల్సన్... ఇప్పుడు ఓ కొత్త కథనాన్ని వినిపిస్తున్నాడు. 'అడవి పందుల కోసమే తాను కొబ్బరికాయల్లో పేలుడు పదార్థాలు పెట్టానని, అనుకోకుండా ఏనుగు వచ్చి వాటిని తినడానికి ప్రయత్నించి తీవ్రంగా గాయపడిందని... తరువాత కొద్ది రోజులకు మరణించిందని' నిందితుడు చెబుతున్నాడు.

అడవి పందుల కోసం పెడితే ఏనుగు చనిపోయింది: నిందితుడు

జంతువులను వేటాడడమే వృత్తి?

పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు విల్సన్.. పాలక్కాడ్​ జిల్లా కొట్టోప్పడం పంచాయతీలోని చల్లికల్ ఒత్తుక్కుంపురం ఎస్టేట్​లో కొబ్బరి పీచుతీసే కార్మికుడు. ఆ ఎస్టేట్ యజమానులు అబ్దుల్ కరీం, రియాసుద్దీన్​లు. ఆ ఏస్టేట్​లోని ఓ షెడ్డులో.. ప్రధాన నిందితుడు విల్సన్ తయారుచేసిన పేలుడు పదార్థాలను, అందుకు వాడిన పరికరాలను పోలీసులు గుర్తించారు.

నిందితుడిని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి.. పేలుడు పదార్థాలు ఉంచిన ప్రాంతంలోని ఆధారాలను సేకరించారు. విల్సన్​ అడవి జంతువులను వేటాడి, వాటి మాంసాన్ని విక్రయిస్తుంటాడని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. నిందితుడు విల్సన్​పై అటవీ, వన్యప్రాణులు రక్షణ చట్టం, అక్రమంగా పేలుడు పదార్థాలు కలిగి ఉన్న నేరాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు అబ్దుల్ కరీం, అతని కుమారుడు రియాసుద్దీన్​ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ప్రాణాలు తీశారు..

గర్భంతో ఉన్న ఏనుగు మే 12వ తేదీన వీరి వల్ల తీవ్రంగా గాయపడిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఏనుగు నోటిలో తీవ్రగాయాలవ్వడం వల్ల అది నొప్పిని భరిస్తూ రెండు వారాల పాటు ఏమీ తినకుండా ఆకలితో అలమటించినట్లు పేర్కొన్నారు. బాధను భరించలేక నీటిలో ఉండిపోయి... శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి, ఊపిరితిత్తులు దెబ్బతిని ఆ ఏనుగు చనిపోయిందని వెల్లడించారు.

ఇదీ చూడండి:కోయంబత్తూరులో మరో గజరాజు మృతి!

ABOUT THE AUTHOR

...view details