ఆ వ్యక్తికి మరికొద్ది సేపట్లో వివాహం. ఆ ఆనందంలో పెళ్లి వేదికపై సందడి చేస్తున్నాడు. ఇంతలో ఆ వివాహానికి వచ్చిన ఓ మహిళ వరుడిపై విరుచుకుపడింది. నన్ను పెళ్లి చేసుకుని మళ్లీ ఇంకో భార్య కావాలా? అంటూ అతడ్ని చితకబాదింది.
ఉత్తర్ ప్రదేశ్లోని షామిలి జిల్లా టిటార్సీ గ్రామంలో పంకజ్ కుమార్(30) అనే వ్యక్తి మరో అమ్మాయిని వివాహం చేసుకుంటుండగా.. అతడి మొదటి భార్య మంజు కుటుంబంతో కలిసి అక్కడకు వచ్చింది. పెళ్లిపీటలపై ఉన్న తన భర్తను చూసి.. కోపంతో ఊగిపోయింది. అతడ్ని చితకబాదింది.