తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భర్తను చంపి, సమాధిపైనే కిరాతక భార్య వంట - wifes inhuman behaviour kills husband

భర్తను చంపి, అతడి సమాధిపై వంట చేస్తోంది ఓ మహిళ. తనపై అనుమానం రాకూడదని పెట్టిన కేసు ద్వారా అసలు నిజం వెలుగుచూసింది.

భర్తను చంపి, సమాధిపైనే కిరాతక భార్య వంట

By

Published : Nov 22, 2019, 12:16 PM IST

మధ్యప్రదేశ్​లోని అనుప్పుర్ జిల్లా రాజేంద్రగ్రామం సమీపంలోని ఓ చిన్న పల్లె కరౌందాటోలా. భార్యతో కలసి జీవనం సాగించేవాడు ప్రసాద్ బనావల్. అయితే గత నెలరోజులుగా బనావల్ కనిపించకుండా పోయాడు. ఇదే విషయంపై కేసు నమోదు చేసింది ఆ ఇల్లాలు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ప్రసాద్ ఇంటిపక్కనే ఉన్న పొయ్యికింద తవ్వకాలు జరిపారు. ఆసక్తికరంగా అక్కడే బనావల్ మృతదేహం బయటపడింది.

ఇదీ జరిగిందీ..

ప్రసాద్​ బనావల్​ను చంపేసి, ఇంటి ఆవరణలోనే పూడ్చేసింది అతడి భార్య. అనుమానం రాకుండా పోలీసు కేసు పెట్టింది. దర్యాప్తు సమయంలో పోలీసులకు అనుమానం రాకుండా సమాధిపై చెత్తా చెదారం చల్లింది. అనంతరం దానిపైనే పొయ్యి ఏర్పాటు చేసి వంటలు వండేస్తోంది. అనుమానం వచ్చిన పోలీసులు అక్కడ తవ్వకాలు జరపగా ప్రసాద్​ బనావల్ మృతదేహం బయటపడింది.

మృతుడి భార్యను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు కారణాలు తెలుసుకునేందుకు మహిళను ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చూడండి: 'రూలర్​' టీజర్​తో అదరగొట్టిన బాలకృష్ణ

ABOUT THE AUTHOR

...view details