తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొడుకు ఉద్యోగం కోసం భర్తను ముక్కలుగా నరికిన మహిళ - wife killed her husband for pension

ఉత్తర్​ప్రదేశ్ బులంద్​షహర్​లో విస్తుపోయే ఘటన జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగిగా పనిచేస్తున్న భర్త చనిపోతే కొడుకుకు ఉద్యోగమైనా వస్తుంది లేదా తనకు పింఛను​ వస్తుందనే దురాశతో.. అతడిని ముక్కలుముక్కలుగా నరికి చంపింది ఓ కర్కశ మహిళ. కుమారుడి సాయంతో ఈ దురాగతానికి ఒడిగట్టింది.

కొడుకు ఉద్యోగం కోసం భర్తను ముక్కలుగా నరికిన మహిళ

By

Published : Sep 18, 2019, 1:17 PM IST

Updated : Oct 1, 2019, 1:22 AM IST

కొడుకు ఉద్యోగం కోసం భర్తను ముక్కలుగా నరికిన మహిళ

సమాజంలో ఆర్థిక విషయాలు మానవతా విలువల్ని ఎంతగా దిగజార్చుతున్నాయో తెలిపేందుకు ఉత్తర్​ ప్రదేశ్ బులంద్ షహర్​లో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. కుమారుడికి ఉద్యోగం, లేదా తనకు పింఛను వస్తుందన్న ఆశతో భర్తనే అత్యంత కిరాతకంగా చంపిందో మహిళ.

అహ్మదానగర్​లో నివాసముండే తేజ్​రామ్..​ సీహీ బబుపుర్​లోని ప్రభుత్వ పాఠశాలలో ప్యూన్. 2020 జనవరిలో పదవీ విరమణ పొందాల్సి ఉంది. తేజ్​రామ్​కు ఇద్దరు కుమారులు జగ్​వీర్​, కపిల్. భార్య పేరు మైమవతి.

మైమవతి అత్యంత అమానుషంగా ఆలోచించింది. పదవీ విరమణకు ముందే భర్త చనిపోతే ఆ ఉద్యోగం తన కుమారుడికి వస్తుందని ఆశించింది. లేకపోతే తనకు పింఛను​ వస్తుందని భావించింది. అనుకున్నదే తడువుగా కొడుకు కపిల్​తో కలిసి భర్తను ముక్కలు ముక్కలుగా నరికింది. శవాన్ని గోనె సంచిలో మూటగట్టి ఊరిబయట చెత్తకుప్పలో పడేసింది.

శనివారం రాత్రి నుంచి తేజ్​పాల్ అదృశ్యమవగా... బీబీనగర్​ ఠాణాలో కేసు నమోదైంది. అనుమానం వచ్చిన పోలీసులు... మైమవతి, కపిల్​ను తమదైన శైలిలో ప్రశ్నించారు. చివరకు నిందితులు ఇద్దరూ నేరాన్ని అంగీకరించారు.

ఇదీ చూడండి: నాలుగేళ్ల బిడ్డను దొంగ నుంచి కాపాడుకున్న అమ్మ

Last Updated : Oct 1, 2019, 1:22 AM IST

ABOUT THE AUTHOR

...view details