తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వితంతువుల గ్రామం... మచ్చ మాయం చేస్తాం' - prevention of alcoholic habit

ఝార్ఖండ్​ రాజధాని రాంచీ సమీపంలోని ఓ గ్రామానికి 'వితంతు ఊరు' అని ముద్ర పడిపోయింది. మద్యపానం వల్లే గ్రామంలో ఈ పరిస్థితి ఏర్పడిందని సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారడమే ఇందుకు కారణం. తమపై పడిన మచ్చను చెరిపేసుకుంటామని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు ఆ గ్రామస్థులు.

'వితంతువుల గ్రామం... మచ్చ మాయం చేస్తాం'

By

Published : Jul 18, 2019, 1:33 PM IST

'వితంతువుల గ్రామం... మచ్చ మాయం చేస్తాం'

ఝార్ఖండ్​ రాజధాని రాంచీకి సమీపంలో ఉంటుంది బ్రాంబే గ్రామం. దీనికి 'వితంతు గ్రామం' అని మరో పేరు కూడా ఉంది. ఎందుకంటే 600 ఇళ్లు ఉన్న ఈ గ్రామంలో 200 మంది వితంతువులు ఉన్నారు. ఇందుకు కారణం మద్యపానమేనని తెలుస్తోంది. ఇదంతా సామాజిక మాధ్యమాలు ఆ గ్రామం గురించి చెప్పే విషయాలు.
అయితే బ్రాంబే గ్రామస్థులు మాత్రం తమ ప్రమేయం లేకుండా ఈ మచ్చ పడిందని చెబుతున్నారు.

"ఈ పేరు వింటే గ్రామస్థులతో పాటు నాకు ఎంతో బాధగా ఉంటుంది. అయితే అది ఒకప్పుడు. గ్రామంలో మద్యం విపరీతంగా తయారు చేసేవారు. అదే మద్యం తాగి చాలా మంది మరణించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా తగ్గిపోయింది."
-గ్రామస్థుడు

గ్రామానికి ఈ అపవాదు రావడానికి కారణం ఓ విశ్యవిద్యాలయ విద్యార్థులు చేసిన సర్వేనేనని మరో గ్రామస్థుడు తెలిపాడు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టానుసారం సామాజిక మాధ్యమాల్లో పెట్టేయడమే ఈ సమస్యకు కారణమని చెప్పాడు.

"ఈ పరిస్థితి ఓ విశ్వవిద్యాలయ విద్యార్థుల వల్ల ఏర్పడింది. వాళ్లు గ్రామంలో ఓ సర్వే చేశారు. సర్వే చేశాక వివరాలు గ్రామ పెద్దలకు చూపించలేదు. నిజమో కాదో తెలుసుకోకుండా యూట్యూబ్​లో పెట్టేశారు. ఇది క్రమంగా పెద్ద సంఖ్యలో ప్రజల్లోకి వెళ్లింది."
-గ్రామస్థుడు

గ్రామంలో వితంతువుల సంఖ్య ఎక్కువ ఉన్నది నిజమే అయినా అది ఇప్పటి సమస్య కాదని గ్రామస్థులు చెబుతున్నారు. పలు సంస్థలు కల్పించిన అవగాహనతో చాలా మంది వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. తమపై పడిన మచ్చను తామే తుడిచేస్తామని ధీమాగా చెబుతున్నారు.

ఇదీ చూడండి: కర్ణాటక విధాన సభలో నిలిచేదెవరో.. నేడే చూడండి

ABOUT THE AUTHOR

...view details