తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మీ సామర్థ్యం అనంతం.. మీరు అద్భుతాలు చేయగలరు' - బెంగళూరులో డీఆర్​డీఓ ల్యాబ్​ను ప్రారంభించిన ప్రధాని మోదీ

బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ.. డీఆర్​డీఓ యువశాస్త్రవేత్తల కోసం రూపొందించిన ఓ ప్రయోగశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు తమ పరిశోధనల పరిధిని మరింత విస్తృతం చేయాలని, అందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.

Widen your horizons, says PM to scientists and innovators
'మీ సామర్థ్యం అనంతం.. మీరు అద్భుతాలు చేయగలరు'

By

Published : Jan 2, 2020, 11:18 PM IST

Updated : Jan 3, 2020, 12:01 AM IST

శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు తమ పరిశోధనల పరిధిని మరింత విస్తృతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

"మీ (శాస్త్రవేత్తలు) సామర్థ్యం అనంతం. మీరు అద్భుతాలు చేయగలరు. మీ పరిశోధనల పరిధిని విస్తృతం చేయండి. మీ పనితీరు పరామితులను మార్చండి. రెక్కలు చాపి ఎగరండి.. మీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. నేను మీతో ఉన్నాను."- నరేంద్ర మోదీ, ప్రధాని

బెంగళూరులో డీఆర్​డీఓ యువ శాస్త్రవేత్తల కోసం రూపొందించిన ప్రయోగశాలలను ఆ సంస్థ చీఫ్​ సతీష్​రెడ్డితో కలిసి మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తల శక్తిసామర్థ్యాలపై ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు.

భవిష్యత్ ఇంటెలిజెంట్ మెషీన్స్​దే..

భవిష్యత్​లో రక్షణ రంగంలో ఇంటెలిజెంట్ మెషీన్లు కీలక పాత్ర పోషిస్తాయని.. అటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఏ మాత్రం వెనకబడి ఉండకూడదని మోదీ అన్నారు. దేశ పౌరులు, సరిహద్దులు, ఆసక్తులను రక్షించుకునేందుకుగాను నూతన ఆవిష్కరణలు చేయాలని, ఇందుకోసం తగిన పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని స్పష్టం చేశారు.

డీఆర్​డీఓ యంగ్ సైంటిస్ట్ లాబొరేటరీలు (డీవైఎస్​ఎల్​) బెంగళూరు, ముంబయి, చెన్నై, కోల్​కతా, హైదరాబాద్​ల్లో ఉన్నాయి. వీటిల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్​ రక్షణవ్యవస్థలను అభివృద్ధి చేస్తారు. 35 ఏళ్లలోపు వారు మాత్రమే ఇందులో చేరడానికి అర్హులు. వీరు ప్రత్యేకమైన పరిశోధన రంగాల్లో పనిచేయాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: ఈ నెల 17న నింగిలోకి జీశాట్‌-30: శివన్

Last Updated : Jan 3, 2020, 12:01 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details