వివాహ వయసుపై మధ్యప్రదేశ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సజ్జన్ సింగ్ వర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది. ఈ విషయంపై ప్రోటెమ్ స్పీకర్‌కు లేఖ రాసింది. సజ్జన్ సింగ్‌పై చర్యలు చేపట్టాలని కోరింది.
కాంగ్రెస్ నేత వివాదస్పద వ్యాఖ్యలు ఇదీ జరిగింది..
మహిళల కనీస వివాహ వయసుపై సజ్జన్ సింగ్ వర్మ బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలికలు 15 ఏళ్లకే సంతాన ఉత్పత్తికి అర్హులు అయితే.. కనీస వివాహ వయస్సును 21కి పెంచడం ఎందుకని ప్రశ్నించారు. బాలికల చట్టబద్ధ వివాహ వయస్సును 18 నుంచి 21కి పెంచుతామన్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటనపై ఈ విధంగా స్పందించారు.
కనీస వివాహ వయస్సు పెంచడానికి సీఎం డాక్టరా లేక సైంటిస్టా అని ఎద్దేవా చేశారు సజ్జన్. మైనర్లకు ప్రభుత్వం రక్షణ కల్పించడంలో విఫలం అవుతోందన్నారు.
ఇదీ చదవండి :మంత్రి అల్లుడి అరెస్ట్‌తో డ్రగ్స్ కేసులో కొత్త కోణం!