మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శల పర్వం కొనసాగుతోంది. రోజూ ఏదో ఒక అంశంలో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు రాహుల్. కరోనా వైరస్ నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు ప్రతి విషయంలో సర్కారు విఫలమైందంటూ ధ్వజమెత్తుతున్నారు.
తాజాగా మధ్యతరగతి ప్రజలకు రుణాలపై వడ్డీని మాఫీ చేయాలని డిమాండ్ చేశారు రాహుల్. పెద్ద పెద్ద వ్యాపారులకే పన్నులు ఎందుకు మాఫీ చేస్తున్నారని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం 'సూటు బూటు సర్కార్' అంటూ ఎద్దేవా చేశారు.
"పెద్ద వ్యాపారాలకు రూ.1.45 లక్షల కోట్ల పన్ను ప్రయోజనాలు కల్పించారు. కానీ మధ్యతరగతి ప్రజలకు రుణాలపై వడ్డీపై మినహాయింపు మాత్రం లేదు. ఎందుకంటే ఇది సూటు బూటు సర్కార్."