తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ విషయంలో మోదీ ఎందుకు భయపడుతున్నారు?' - Rahul gandhi criticize modi

కొవిడ్​-19పై పోరాటానికి ఏర్పాటు చేసిన పీఎం-కేర్స్​ నిధి అంశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. దాతల పేర్లు పంచుకోవటానికి మోదీ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. చైనాకు చెందిన పలు సంస్థలు విరాళాలు ఇచ్చినట్లు అందరికి తెలుసని పేర్కొన్నారు.

Rahul
'ఆ విషయంలో మోదీ ఎందుకు భయపడుతున్నారు'

By

Published : Jul 11, 2020, 8:11 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. పీఎం కేర్స్​ నిధికి విరాళాలు అందించిన దాతల పేర్లను మోదీ వెల్లడించకపోవటం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. ఈ విషయంలో ప్రధాని భయపడుతున్నారా అంటూ ట్విట్టర్​ వేదికగా ప్రశ్నించారు.

" పీఎం కేర్సు నిధికి విరాళాలు అందించిన వారి పేర్లు వెల్లడించేందుకు ప్రధాని ఎందుకు భయపడుతున్నారు? చైనాకు చెందిన హువావే, షియోమీ, టిక్​టాక్​, వన్​ప్లస్​ వంటి పలు కంపెనీలు విరాళాలు అందించినట్లు ప్రతిఒక్కరికి తెలుసు. ఆయన ఎందుకు వివరాలు పంచుకోవట్లేదు?"

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

పీఎం కేర్స్​ నిధులను సమీక్షించేందుకు పార్లమెంట్​ ప్యానల్​ను భాజపా ఎంపీలు అడ్డుకున్నారన్న వార్తలను ట్వీట్​కు జతచేశారు రాహుల్​ గాంధీ.

కొద్ది రోజులుగా పీఎం కేర్స్​ నిధులపై ఆడిట్​ జరగాలని రాహుల్​ గాంధీ సహా కాంగ్రెస్​ పార్టీ డిమాండ్​ చేస్తోంది. ఇటీవల కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలోనూ ఈ అంశాన్ని లేవనెత్తారు రాహుల్​. ప్రజల నుంచి డబ్బు అందిన నేపథ్యంలో ఆడిట్​, సమీక్ష పరిధిలోకి తప్పనిసరిగా తీసుకురావాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: ప్రధాని మోదీ ఓ అసత్యాగ్రహి: రాహుల్​ గాంధీ

ABOUT THE AUTHOR

...view details